థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 13వ ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ ఈవెంట్లో బాలీవుడ్ నటి సన్నీ లియోనీని మూడు అవార్డులు వరించాయి. ఇందులో ఆసియా మహిళా సాధికారత, 40 అండర్ 40, ఇన్ఫ్లుయంషియల్ ఆసియన్ మహిళ అవార్డులు ఉన్నాయి. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుందీ భామ. ఈ గౌరవం దక్కినందుకు తనకు గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది.
భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది సన్నీ. ప్రస్తుతం 'కోకా కోలా' అనే సినిమాతో పాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ.
![Sunny Leone with honour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/83927474_1272949176237118_9126690286497923397_n_1002newsroom_1581341233_778.jpg)