ETV Bharat / sitara

పరిస్థితి అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు: సునీత - సింగర్ సునీత న్యూస్

ప్రముఖ గాయని సునీత ఇటీవలే బిజినెస్​ మెన్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్నారు. సునీతకు ఇంతకుముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత పలు విషయాలు పంచుకున్నారు. తమ వైవాహిక బంధం, కుటుంబం గురించి వెల్లడించారు.

sunitha ram interview with suma
గాయని సునీత
author img

By

Published : Feb 15, 2021, 12:02 PM IST

Updated : Feb 15, 2021, 3:03 PM IST

తన మధురమైన స్వరంతో గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎంతోమంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. ఆమె ఇటీవల రామ్‌ వీరపనేనితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వాలంటైన్స్‌డే సందర్భంగా ఈ జంట ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తమ వైవాహిక బంధం, కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"ఎప్పటి నుంచో రామ్‌ నాకు తెలుసు. తను ఎప్పుడైనా ఫోన్‌ చేస్తే కాల్‌ లిఫ్ట్‌ చేసేదాన్ని కాదు. వృత్తిపరమైన పనుల విషయమై లాక్‌డౌన్‌లో రామ్‌ ఓసారి నాకు ఫోన్‌ చేశారు. 'ఇంకేంటి.. ఇలాగే ఉండిపోతావా? లేక పెళ్లి గురించి ఏదైనా ప్లాన్స్‌ ఉన్నాయా?' అని రామ్‌ను అడిగాను. దానికి ఆయన 'నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాదాపు ఏడేళ్ల నుంచి పరోక్షంగా నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను' అని సమాధానమిచ్చారు. అనంతరం, అమ్మానాన్న, నా పిల్లల్తో మాట్లాడాను. వాళ్లందరూ ఎంతో సంతోషించారు. అదే సమయంలో రామ్‌.. నా గురించి వాళ్లింట్లో చెప్పడం.. అక్కడ కూడా ఓకే అనడం జరిగింది"

sunitha ram interview with suma
రామ్-సునీతతో సుమ

"ఇరు కుటుంబాల్లోనూ మా వివాహాన్ని ఓకే అనుకున్నాక.. రామ్‌ వాళ్ల కుటుంబసభ్యులు మా అమ్మవాళ్లతో మాట్లాడడానికి మొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేసమయంలో నాకు తాంబూలం అందించారు. ఆ ఫొటోలే బయటకు వచ్చాయి. నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ విషయం మా ఇద్దరికీ తెలీదు. అది జరిగిన తర్వాత రోజు నాకు తెలిసిన వాళ్లు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మాకు నిశ్చితార్థమైందని నెట్టింట్లో పోస్టులు దర్శనమిచ్చాయి. ఓసారి పనిపై బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు నాపై కోపంగా ఉన్నారు. 'నిన్న నీకు ఎంగేజ్‌మెంట్‌ అని మాకు ముందే చెప్పొచ్చు కదా. మేము మంచి బట్టలు వేసుకునేవాళ్లం. లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మాకు చెప్పవా?' అని ప్రశ్నించారు. 'ఇది ప్లాన్‌ చేయలేదురా. వాళ్లు వచ్చారు.. అనుకోకుండా నాకు బట్టలు పెట్టారు' అని సమాధానమిచ్చాను. నా పిల్లలు పరిస్థితి అర్థం చేసుకున్నారు. వాళ్లు నాకెంతో సపోర్ట్ చేశారు" అని సునీత వివరించారు.

Last Updated : Feb 15, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.