కోన వెంకట్ సమర్పణలో సందీప్ కిషన్ హీరోగా డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. 'రౌడీ బేబీ' టైటిల్‌తో చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్‌ను మార్చారట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
"రౌడీ బేబీ' టైటిల్ మారింది. మరో ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టబోతున్నాం. మారింది టైటిల్ మాత్రమే. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం" అని పేర్కొంది.
ఈ సినిమాలో సందీప్‌కిషన్ సరసన నేహాశెట్టి సందడి చేయనుంది. చౌరస్తా రామ్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ కిషన్, లావణ్యత్రిపాఠి జంటగా ఇటీవల విడుదలైన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' థియేటర్లలో అలరిస్తోంది.
ఇదీ చూడండి: ఆ కథకు మూడేళ్లు మెరుగులు దిద్దా!