ఉదయ్ కిరణ్ బయోపిక్ త్వరలో మొదలు కానుందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యువహీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో కనిపించడం సహా స్వయంగా నిర్మిస్తాడంటూ వదంతలు వచ్చాయి. ఎట్టకేలకు వీటిపై స్పందించాడీ కథానాయకుడు. తనకు బయోపిక్‌లు చేసే ఉద్దేశం ప్రస్తుతం లేదంటూ స్పష్టతనిచ్చాడు. ఈ వ్యాఖ్యలతో ఇప్పటివరకు వచ్చినవన్నీ పుకార్లనేని తేలింది.
ఇటీవలే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'తో ప్రేక్షకుల మందుకొచ్చాడు సందీప్. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హాకీ కథతో తెరకెక్కుతోందీ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు గాయాలు