Suma Jayamma panchayati movie release date: యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన సుమ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీపై సోమవారం ఉదయం సుమ అప్‌డేట్ ఇచ్చారు. మార్చి నెలలో 'ఆర్‌ఆర్‌ఆర్', ఏప్రిల్ రెండో వారంలో 'కేజీఎఫ్-2', ఏప్రిల్ చివర్లో 'ఆచార్య', మేలో 'సర్కారువారి పాట'.. ఇలా వరుస స్టార్ హీరోల సినిమాలు రానున్న తరుణంలో.. ఏప్రిల్ 22న 'జయమ్మ పంచాయితీ'ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈసినిమాలో సుమ.. గడుసైన గ్రామీణ మహిళగా కనిపించనున్నారు. పల్లెటూరి మహిళగా ఆమె భాష, లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. కీరవాణి స్వరాలు అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అనుష్క లేదా సామ్?
Anushka Samantha new movie updates: టాలీవుడ్లో సీనియర్ నటి విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చింది హీరోయిన్ అనుష్క అనే చెప్పాలి. తనదైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంత కాలంగా సినిమాల విషయాల్లో జోరు తగ్గించిన ఈమె.. చివరిగా 'నిశబ్దం' చిత్రంలో అభిమానులను పలకించారు. కానీ ఇది అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో అనుష్కతో పాటు పలువురు ముద్దుగుమ్మలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తమదైన ముద్ర వేశారు. వీరిలో సామ్ ఒకరు. కొంతకాలం క్రితం వరకు కమర్షియల్, లవ్‌స్టోరీస్ మాత్రమే చేసిన సామ్.. తాజాగా ఓ ఐటెమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతోపాటే వరుసగా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ బిజీ అయిపోయారు. అయితే వీరిద్దరిలో ఒకరితో ఓ బయోపిక్ చేసేందుకు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన 'బెంగళూరు నాగరత్నమ్మ' బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఆ కథను సమంత, అనుష్కకు చెప్పారట. అయితే ఈ కథపై అనుష్క ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. కానీ దీనిపై వీరిద్దరూ ఇంకా తమ తుది నిర్ణయాన్ని మాత్రం చెప్పలేదట. మరి వీరిలో ఈ సినిమాను ఎవరు ఓకే చేస్తారో చూడాలి.
ఎవరీ 'బెంగళూరు నాగరత్నమ్మ'?
ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. ఓ దేవదాసి అయినా ఈమె సంగీతం నేర్చుకుని.. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె జీవిత ప్రయణాన్ని నేటి తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించున్నారు.
ఇదీ చూడండి: నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా?.. షాక్‌లో ఫ్యాన్స్!