ETV Bharat / sitara

మెగాస్టార్​ చిరంజీవితో సుకుమార్ సినిమా ఫిక్స్​ - mahaan

Sukumar to Direct Megastar Chiranjeevi: టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​ సెట్​ అయ్యింది. మెగాస్టార్​ చిరంజీని డైరెక్ట్​ చేయనున్నారు సుకుమార్.

sukumar
chiranjeevi
author img

By

Published : Feb 22, 2022, 9:30 PM IST

Updated : Feb 22, 2022, 10:58 PM IST

Sukumar to Direct Megastar Chiranjeevi: ప్రముఖ నటుడు చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయాలనే నా కల నిజమైంది. వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తా" అంటూ చిరంజీవితో దిగిన ఫొటోని షేర్‌ చేశారు. సుకుమార్‌ అనూహ్య ప్రకటనతో సినీ అభిమానులు సర్‌ప్రైజ్‌ ఫీలవుతున్నారు. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదే కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

sukumar
చిరంజీవితో సుకుమార్

ఇటీవల.. 'పుష్ప'తో మంచి విజయం అందుకున్న సుకుమార్‌ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. మరోవైపు, యువ నటుడు విజయ్‌ దేవరకొండతో ఓ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో 'గాడ్‌ ఫాదర్‌', మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళాశంకర్‌' సినిమాలు చేస్తున్నారు. కె. ఎస్‌. రవీంద్ర (బాబీ)తో ఓ చిత్రం ఖరారు చేశారు.

నాని బర్త్​డే హోమం..

యువ హీరో​ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికీ'. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సందర్భంగా.. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు 'బర్త్​డే హోమం' చేయనున్నట్లు ఓ పోస్టర్​ విడుదల చేసింది చిత్రబందం. దీనిపై నాని.. 'ఏంటో' అంటూ ఫన్నీగా స్పందించారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే మలయాళ బ్యూటీ నజ్రియా.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

విక్రమ్‌ 'మహాన్‌' మేకింగ్‌ వీడియో..

విక్రమ్‌ కథానాయకుడిగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహాన్‌'. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ల నటన అలరించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్‌ తదితరులు తమ పాత్రల కోసం ఏవిధంగా కష్టపడ్డారో ఇందులో చూపించారు. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్'​కు బిగ్​బీ వాయిస్​ఓవర్​.. రిలీజ్​ డేట్స్​తో సూర్య, అడవిశేష్​

Last Updated : Feb 22, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.