దర్శకుడు సుకుమార్ మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలోని మట్టపర్రు గ్రామంలో తన తండ్రి తిరుపతి రావు నాయుడు పేరు మీద రెండంతస్థుల పాఠశాల భవనం నిర్మాణానికి ముందుకొచ్చారు. దీనిని సుమారు రూ.14 లక్షల ఖర్చుతో కట్టనున్నారు.
ఈ దర్శకుడు అల్లు అర్జున్తో ప్రస్తుతం 'పుష్ప' సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. కరోన ప్రభావంతో మధ్యలో నిలిచిపోయింది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత తిరిగి ప్రారంభించే అవకాశముంది.