ETV Bharat / sitara

'పుష్ప'లో సమంత సాంగ్.. సుకుమార్ ఎలా ఒప్పించాడంటే?

ఇప్పటివరకు హీరోయిన్​ చేసిన సమంత.. తొలిసారి 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పాట ఆమె చేయడానికి ఒకే ఒక కారణం డైరెక్టర్ సుకుమార్. ఇంతకీ అతడు ఏం చెప్పి ఒప్పించాడంటే?

samantha pushpa song
సమంత పుష్ప సాంగ్
author img

By

Published : Dec 19, 2021, 5:26 PM IST

'పుష్ప' సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు.. 'ఊ అంటవా ఊహు అంటవా' అంటూ పాడుతూ థియేటర్​ బయటకొస్తున్నారు. అంతలా ఆడియెన్స్​కు కనెక్ట్​ అయిందీ పాట. ఇందులో సమంత డ్యాన్స్, దానికి డీఎస్పీ మ్యూజిక్​.. పాటను ఓ రేంజ్​లోకి తీసుకెళ్లాయి. అయితే ఈ పాట కోసం సామ్​ను ఎలా ఒప్పించారని ప్రశ్నించగా దర్శకుడు సుకుమార్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

సుకుమార్ తీసే ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. ఈ డైరెక్టర్​ గత చిత్రం 'రంగస్థలం'లోనూ పూజాహెగ్డే 'జిగేలు రాణి' గీతం.. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్​గా నటించిన సమంతనే.. 'పుష్ప'లో ప్రత్యేక గీతం చేస్తే బాగుంటుందని సుక్కు భావించారట.

samantha pushpa song
పుష్ప స్పెషల్ సాంగ్​లో బన్నీ-పుష్ప

అందులో భాగంగానే సామ్​ను సంప్రదించగా.. తనకు ఈ పాట కరెక్ట్​ కాదని చెప్పిందట. అయితే నటిగా ఇది మీకు కొత్తగా ఉంటుంది, ఈ సాంగ్ బాగా నప్పుతుందని సమంతతో చెప్పి ఒప్పించానని సుకుమార్ వెల్లడించారు. 'జిగేల్​రాణి' పాట గురించి ప్రస్తావన తీసుకొస్తేనే నో చెప్పిన సమంత.. తన మాటపై నమ్మకంతోనే 'ఊ అంటవా ఊహు అంటవా' పాట చేసిందని సుక్కు చెప్పారు.

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' తొలి భాగం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రెండు రోజుల్లోనే(రూ.116) వందకోట్ల రూపాయల మార్క్​ గ్రాస్​ కలెక్షన్ సొంతం చేసుకుంది.

ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.