ETV Bharat / sitara

రెండక్షరాల టైటిల్​పైనే బన్నీ కన్ను! - Allur Arjun two letter movies

అల్లు అర్జున్​-సుకుమార్ కాంబినేషన్​లో తీస్తున్న సినిమాకు మరోసారి రెండక్షరాల టైటిల్​ పెట్టాలని భావిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరూ 'ఆర్య', 'ఆర్య 2'లో కలిసి పనిచేశారు.​

SUKUMAR AND BUNNY ONCE AGAIN TRYING TO TWO LETTERS TITLE FOR NEXT MOVIE
మరోసారి రెండక్షరాల టైటిల్​పై కన్నేసిన బన్నీ!
author img

By

Published : Apr 4, 2020, 8:42 AM IST

'ఆర్య', 'బన్నీ', 'హ్యాపీ','వేదం', 'ఆర్య 2', 'డీజే'.. ఇవి అల్లు అర్జున్‌ నటించిన సినిమాలకున్న రెండక్షరాల పేర్లు. ఇప్పుడు ఇదే తరహాలో తన కొత్త చిత్రానికి టైటిల్​ పెట్టాలని చూస్తున్నాడు స్టైలిష్ స్టార్. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్​తో కలిసి హ్యాట్రిక్​ చిత్రం చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో 'ఆర్య', 'ఆర్య 2'లు వచ్చాయి.

అమ్మాయి పేరుతో?

స్మగ్లింగ్‌ నేపథ్య కథతో బన్నీతో సినిమా తీస్తున్నాడు దర్శకుడు సుకుమార్‌. అడవుల్లో సాగే చిత్రం కావడం వల్ల 'శేషాచలం' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం కొత్త పేరును పెట్టే ఆలోచనలో ఉంది చిత్రబృందం. అది అమ్మాయి పేరు కావొచ్చని సమాచారం. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఈనెల 8న టైటిల్, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇందులో హీరోయిన్​గా రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.

ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ సంక్రాంతికి బరిలో ఉంటాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.