ETV Bharat / sitara

ఒకే సినిమాతో ముగ్గురు స్టార్​ వారసులు ఎంట్రీ! - agastya nanda debut film in bollywood

Suhanakhan Kushikapoor movie debut: బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ మనవడు అగస్త్య నంద, సూపర్​స్టార్​ షారుక్​ ఖాన్ కూతురు సుహానా ఖాన్​​, ప్రముఖ నిర్మాత బోణీకపూర్​ చిన్న కూతురు ఖుషీ కపూర్​ వెండితెర అరంగేట్రం అంతా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు?

suhana khan
సుహానా ఖాన్
author img

By

Published : Feb 24, 2022, 11:45 AM IST

Updated : Feb 24, 2022, 1:08 PM IST

Suhanakhan Kushikapoor movie debut: బాలీవుడ్​ బాద్​ షా కుమార్తె సుహానా ఖాన్, బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ మనవడు అగస్త్య నందను.. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ వెండితెరకు పరిచయం చేయనున్నారని గతకొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. 'ది ఆర్చీస్'​ అనే సినిమాతో వారు ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

అయితే ఇప్పుడీ వార్తలకు బలం చేకూరేలా కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. సుహానా, అగస్త్య నంద.. ముంబయిలోని ఓ డ్యాన్స్ క్లాస్​లో కెమెరా కంటికి చిక్కారు. అక్కడ జోయా కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలే సోషల్​మీడియాలో ట్రెండింగ్​ అవుతున్నాయి.

ఇవి చూసిన అభిమానులు.. సుహానా, అగస్త్య కాంబోలో సినిమా ఖరారైపోయినట్లేనని భావిస్తున్నారు. తమ అభిమాన నటుల వారసులు త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ప్రముఖ నిర్మాత బోణీకపూర్, దివంగత నటి శ్రీదేవి​ చిన్న కూతురు ఖుషీ కపూర్​ కూడా చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈమెను కూడా 'ది ఆర్చీస్'​ చిత్రంతోనే పరిచయం చేయాలని దర్శకురాలు జోయా భావిస్తున్నారట. ఈ విషయమై చర్చలు కూడా జరిపారని తెలిసింది. ఇది కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే ముగ్గురు స్టార్​ కిడ్​లు ఒకే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసినట్లు అవుతుంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: అజిత్​ 'వలిమై' సోషల్​మీడియా రివ్యూ

Last Updated : Feb 24, 2022, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.