సున్నితమైన ప్రేమకథ, చక్కటి హాస్యంతో ప్రేక్షకులను అలరించిన చిత్రం 'సమ్మోహనం'. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, సుధీర్‌బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ హిట్ కాంబో నుంచి మరో కొత్త సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమైంది. నేడు ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై మహేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకులు వి.వి.వినాయక్, నిర్మాతలు దిల్ రాజు, రవికుమార్‌లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

మార్చి నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.