బాలీవుడ్ చిత్రాలు పిల్లలపై దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. సినిమాల వల్ల పొగాకు, మద్యానికి ఎక్కువ అలవాటు పడుతున్నారని లండన్‌లోని వైటల్ స్ట్రాటజీస్, ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు తేల్చారు.
"పిల్లల్లో అనారోగ్య కారకాలను ప్రోత్సహించడానికి బాలీవుడ్ చిత్రాలు దోహదం చేస్తున్నాయని మా అధ్యయనంలో తేలింది. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వాటిని సినిమాల్లో నిషేధించడానికి మా అధ్యయనం సహాయపడుతుందని ఆశిస్తున్నాం".
- డాక్టర్ నందితా మురుకుట్ల, పరిశోధకురాలు
1994- 2013 మధ్యకాలంలో వచ్చిన 300 చిత్రాలను వీరు విశ్లేషించారు. ఇందులో 93 శాతం మద్యాన్ని, 70 శాతం పొగాకును, 21 శాతం ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రోత్సహించిన్నట్లు అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఒక్కొక్క సినిమాలో సగటున పొగాకు ఉత్పత్తులను 4 సార్లు, ఆల్కహాల్ ఉత్పత్తులను 7 సార్లు చూపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఫాస్ట్‌ఫుడ్‌కు సంబంధించిన ఉత్పత్తులను ప్రతి సినిమాలో 0.4 సార్లు వాడినట్లు తెలిపింది.
అడల్ట్ రేటేడ్ చిత్రాల్లో పొగాకు, ఆల్కహాల్‌కు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. యు, యు/ఏ సర్టిఫైడ్ సినిమాలు ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
ఉత్ప్రేరకాలను వాడకుండా..
ప్రేక్షకుల ఆరోగ్య భద్రత దృష్ట్యా చిత్రబృందాలు కొన్ని విషయాల్లో జాగ్రత్త పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వాటిలో..
- ప్రతి సన్నివేశంలో అనారోగ్యానికి కారణమైన ఉత్పత్తుల వాడకాన్ని పర్యవేక్షించి వాటిని నిషేధించేలా చూడటం.
- అనారోగ్య ఉత్ప్రేరకాల వాడకాన్ని చూసి ఆ సినిమాలను సర్టిఫై చేయడం.
- అనారోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వ రాయితీలను తీసివేయడం.
ఇదీ చూడండి... షార్క్‌తో స్విమ్మింగ్ చేసిన కత్రినా కైఫ్