ETV Bharat / sitara

10 ఏళ్లుగా నీ ప్రేమ ఆస్వాదిస్తున్నా: సమంత - samantha akkineni, akkineni naga chaitanya

టాలీవుడ్​ హాట్​కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. వీరిద్దరి మధ్య అనుబంధానికి పదేళ్లు నిండిన సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్​ చేసింది సామ్​.

10 ఏళ్లుగా నీ ప్రేమ ఆస్వాదిస్తున్నా: సమంత
author img

By

Published : Oct 6, 2019, 8:29 PM IST

టాలీవుడ్‌ యువ జంట అక్కినేని నాగచైతన్య, సమంతల అనుబంధానికి పదేళ్లు నిండాయి. 2017లో వివాహం చేసుకున్న వీరు.. ఆదివారంతో ఆ బంధానికి రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సామ్‌ సోషల్‌మీడియాలో ప్రత్యేకమైన పోస్ట్‌ చేసింది. తన ప్రియమైన భర్త చైతన్యతో కలిసి వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను కూడా షేర్‌ చేసింది.

" మా ప్రేమ మరింత బలపడింది.. పదేళ్ల ప్రేమకథలో రెండో వివాహ వార్షికోత్సవం. నీ ప్రేమకు బందీనయ్యా చైతన్య" అని సామ్‌ భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టింది.

ఈ సందర్భంగా నెటిజన్లు, ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రముఖులు చై-సామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హన్సిక, లావణ్య త్రిపాఠి, కాజల్‌, త్రిష, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కోన నీరజ, అల్లు స్నేహారెడ్డి తదితరులు విషెస్​ తెలిపారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని నమ్రత, కాజల్‌, హన్సిక, నీరజ, లావణ్య, స్నేహారెడ్డి కామెంట్‌ చేశారు.

Stronger and stronger .. two year anniversary and a ten year story .. stuck on you
సమంత షేర్​ చేసిన ఫొటోలు

" సో క్యూట్‌.. ఆ దేవుడు మీ ఇద్దర్ని ఆశీర్వదించాలి"
-త్రిష, సినీ నటి

" నాకు ఎంతో ఇష్టమైన జంట.. మీరిద్దరు ఎప్పటికీ ఇలాగే అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నా"
-రకుల్‌ ప్రీత్​ సింగ్​, సినీ నటి

" మై ఫేవరెట్‌.. ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి"
- నందినిరెడ్డి, దర్శకురాలు

" పెళ్లి రోజు శుభాకాంక్షలు లవ్లీస్‌. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా"
- రానా దగ్గుబాటి, సినీ నటుడు

2009లో 'ఏ మాయ చేశావే' చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు చై-సామ్​. ఆ తర్వాత కొన్నాళ్లు వీరిద్దరూ దూరంగా ఉన్నారు. 2013లో మళ్లీ బంధం కొనసాగించిన ఈ జంట... 2015 నవంబరు​లో డేటింగ్​లో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. చివరికి 2017లో అక్టోబర్​ 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.