ETV Bharat / sitara

దిల్లీలోని వీధికి సుశాంత్ రాజ్​పుత్ పేరు - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ వీధి

దక్షిణ దిల్లీలోని ఓ వీధికి బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ పేరు పెట్టనున్నారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి అనుమతి లభించినట్లు ఆ కాలనీ కౌన్సిలర్ తెలియజేశారు.

Street in Delhi to be named after Sushant Singh who would have turned 35 today
దిల్లోలోని వీధికి సుశాంత్ రాజ్​పుత్ పేరు
author img

By

Published : Jan 21, 2021, 5:25 PM IST

గతేడాది జూన్ 14న బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన జ్ఞాప‌కాల ద్వారా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయ‌న జ్ఞాప‌కంగా దక్షిణ దిల్లీ ఆండ్రూస్ గంజ్​లోని ఓ ర‌హ‌దారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టారు. దీనికి అధికారుల నుంచి ఆమోదం లభించింది.

ఎస్​డీఎమ్​సీ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్​ గతేడాది సెప్టెంబర్​లో వీధికి సుశాంత్ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో దీనికి ఆమోదం లభించినట్లు ఓ అధికారి తెలియజేశారు.

గురువారం సుశాంత్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు అభిషేక్. "రోడ్ నెం.8లో ఎక్కువగా బిహార్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారు ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంప్ వరకు ఉన్న మార్గానికి 'సుశాంత్ రాజ్​పుత్ మార్గ్'​గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అందువల్లే ఈ ప్రతిపాదన చేశా" అని దత్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.