హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న అనంతరం బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా లాస్‌ఏంజెల్స్‌లో స్థిరపడింది. సినిమా షూటింగ్స్, కుటుంబసభ్యులను కలిసేందుకు ఆమె అప్పుడప్పుడూ ఇండియా వచ్చి వెళ్తుంటుంది. అయితే గతేడాది ప్రియాంక కోసం నిక్ ప్రత్యేకంగా లాస్ ఏంజెల్స్‌లో ఓ అందమైన, విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడు. అత్యంత ఖరీదైన శాన్ ఫెర్నాండో వ్యాలీలో ఉన్న వీరి విల్లా ధర సుమారు 20 మిలియన్ డాలర్లు (రూ.151 కోట్లు) అని అప్పట్లో అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో గతేడాది అత్యంత ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేసి స్థానిక రియల్ ఎస్టేట్ రికార్డులను నిక్ కొల్లగొట్టాడు. 20 వేల చదరపు అడుగులతో ఉన్న ఈ ఇంట్లో 7 పడక గదులు, 11 బాత్‌రూమ్‌లు ఉన్నాయి.
![Step inside Priyanka Chopra Nick Jonas Los Angeles mansion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221900_1.jpg)
అయితే, ప్రస్తుతం కరోనా కారణంగా ప్రియాంక, ఆమె భర్త నిక్ ఈ ఇంటికే పరిమితమయ్యారు. వీరితోపాటు స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా ఈ భవంతిలోనే సరదాగా గడుపుతున్నారు. ఆ ఖరీదైన భవంతికి సంబంధించిన ఫొటోలను మీరూ ఓసారి చూసేయండి..
![Step inside Priyanka Chopra Nick Jonas Los Angeles mansion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221900_5.jpg)
![Step inside Priyanka Chopra Nick Jonas Los Angeles mansion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221900_2.jpg)
![Step inside Priyanka Chopra Nick Jonas Los Angeles mansion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221900_4.jpg)
![Step inside Priyanka Chopra Nick Jonas Los Angeles mansion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221900_3.jpg)
![Step inside Priyanka Chopra Nick Jonas Los Angeles mansion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221900_7.jpg)
ఇదీ చూడండి.. 'అల వైకుంఠపురములో' అరుదైన రికార్డు