ETV Bharat / sitara

తెలుగు వంటకాలపై ప్రేమలో పడ్డ 'ఇస్మార్ట్' నటి - నన్ను దోచుకుందువచే నటీమణి ఇంటర్యూ

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు నినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది నభా నటేష్. తర్వాత పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్' యాక్టింగ్ చేసి ప్రేక్షకులను అలరించింది ఈ కన్నడ భామ. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ అవుతోన్న నభా నటేష్ 'ఈనాడు-ఈటీవీ భారత్'​ సినిమాతో దసరా కబుర్లు పంచుకుంది.

NABHA NATESH_ INTERVIEW
తెలుగు వంటకాలపై ప్రేమ పెంచుకున్న 'ఇస్మార్ట్' నటి
author img

By

Published : Oct 25, 2020, 7:11 AM IST

Updated : Oct 25, 2020, 7:19 AM IST

'పేరుకు తగ్గట్టుగానే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుంది కన్నడ కస్తూరి నభా నటేష్. దర్శకుడు పూరి ఈమెని ఇస్మార్ట్‌ హీరోయిన్‌గా మార్చేశారు. ఇక కెరీర్‌కి మరింత వేగం వచ్చేసింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నభా నటేష్‌ ‘'ఈనాడు-ఈటీవీ భారత్' సినిమా’తో దసరా ముచ్చట్లని పంచుకుంది. ఆ విషయాలివీ...

* దసరా పండగ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది?

ఈ పండగతో ముడిపడిన జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. మా సొంతూరు శృంగేరి. భారతదేశంలో నాలుగు శారదాపీఠాలు ఉంటే అందులో ఒకటి శృంగేరిలో ఉంది. దసరా నవరాత్రులు అక్కడ బాగా జరుగుతాయి. శారదాదేవి విభిన్నమైన అలంకారాలతో దర్శనమిస్తుంది. చిన్నప్పుడు ఆ తొమ్మిది సాయంకాలాలు క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం, అలంకారాలు చూడటం, కజిన్స్‌తో కలిసి బయట సందడిని ఆస్వాదించడం భలే ఉండేది.

* బిజీ అయ్యాక ఆ సందడిని మిస్‌ అవుతున్నారా?

చాలా మిస్‌ అవుతుంటా. పండగల సమయంలో కుదరకపోతే, ఖాళీ దొరికినప్పుడైనా ఊరికి వెళుతుంటా. ఎందుకో చిన్నప్పటి అనుభూతి ఇప్పుడు కలగదు. ఎంతైనా చిన్ననాటి రోజులు, ఆ సరదాలే వేరు కదా (నవ్వుతూ).

* ఈసారి దసరా పండగ ఎక్కడ జరుపుకొంటున్నారు?

కరోనా వల్ల ఈసారి నా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. దసరా సరదాలేమీ లేవు. ఈమధ్యే చిత్రీకరణలు షురూ అయ్యాయి కాబట్టి, హైదరాబాద్‌లోనే ఉన్నా.

* కరోనా తర్వాత జీవితం మళ్లీ గాడిన పడినట్టేనా?

ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. మునుపటిలా సాధారణ పరిస్థితులు రావడానికి సమయం పట్టేలా ఉంది. కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత పూర్తిగా కోలుకుంటుంది.

* ఇది వరకటితో పోలిస్తే సెట్‌లో పరిస్థితి ఎలా ఉంది?

ఇంతకుముందు రోజూ ఉదయం సహచరుల్లో ఎవరు సెట్లోకి వచ్చినా దగ్గరికి వెళ్లి ఒకరినొకరు పలకరించుకోవడం, కరచాలనం చేసుకోవడం, హత్తుకోవడం, మంచి చెడులు పంచుకోవడం... ఇలా ఉండేది వాతావరణం. ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే అక్కడ్నుంచి వెళ్లిపోవడమే అన్నట్టుంది పరిస్థితి. భయం అని చెప్పలేను కానీ... ఇదివరకటితో పోలిస్తే కొంచెం అసహజంగా ఉంటుంది వాతావరణం. దేన్నైనా టచ్‌ చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

* లాక్‌డౌన్‌ సమయాన్ని పెయింటింగ్స్‌ వేస్తూ గడిపినట్టున్నారు. వాటితో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తారా?

పెయింటింగ్సే కాదు, ఇంకా చాలా పనులు చేశా. నాకు చిత్రలేఖనం అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. సృజనాత్మకంగా ఆలోచించడానికి ఈ కళ చాలా సాయం చేస్తుంది. మనసుకు ఏదైనా ఇబ్బందిగా అనిపించిందంటే చాలు... కుంచె చేతపడతా. అంతే... కొన్ని క్షణాల్లో మనసు ప్రశాంతంగా మారుతుంది. అంటే భవిష్యత్తులో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తానేమో చెప్పలేను.

* నట ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారా?

మంచి పాత్రలు చేస్తున్నాను కదా. నటులకి ఇంతకంటే ఏం కావాలి? అయితే భవిష్యత్తులో చేయాల్సింది చాలానే ఉంది. ప్రతి సినిమా ఓ కొత్త అనుభవాన్నిస్తోంది. మనం చేసిన పని పది మందికి నచ్చి, గుర్తించారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ పూర్తిచేశా. ‘అంధాదున్‌’ రీమేక్‌లో నటిస్తున్నా.

సరదా... సరదాగా

''పండగ వచ్చిందంటే చాలు... మా ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. ఇల్లు కొత్త కళ సంతరించుకుంటుంది. మా ఇంట్లో నేను, మా తమ్ముడు, అమ్మానాన్న ఉంటాం. లంచ్‌ కోసం అమ్మ ఉదయం నుంచే కసరత్తులు మొదలు పెడతారు. నేను సాయం చేస్తుంటా. కలిసి స్వీట్లు తయారు చేస్తుంటాం. సాయంత్రాల పూట సంప్రదాయబద్ధంగా తయారవుతుంటా. గుడికి వెళుతుంటాం. ఈ మధ్యలో బంధువులు, స్నేహితులు వచ్చి వెళుతుంటారు. ఆ రెండు రోజులు చాలా సరదాగా గడిచిపోతుంటాయి".

ఇక్కడ చాలా వెరైటీలు

"తెలుగు సంస్కృతి, సంప్రదాయాలంటే చాలా ఇష్టం. ఒకొక్క విషయాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటా. అది సినిమా ప్రయాణానికే కాదు, జీవితానికీ చాలా ఉపయోగపడుతుంది కదా! అయితే తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చాక ముందు తెలుగు వంటకాలపై ప్రేమ పెంచుకున్నా. ఎందుకంటే నేను భోజన ప్రియురాలిని. శాఖాహారంలో కానీ, మాంసాహారంలో కానీ ఇక్కడ చేసినన్ని వెరైటీలు మరెక్కడా చేయరేమో అనిపిస్తుంది".

ఇదీ చదవండి:మరో తెలుగు సినిమాలో రష్మిక!

Last Updated : Oct 25, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.