ETV Bharat / sitara

స్టార్ హీరో డ్రీమ్ హౌస్​ కోసం రూ.150 కోట్లు! - ధనుశ్​ లేటెస్ట్​ న్యూస్​

తన కొత్త ఇంటి కోసం కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్(Dhanush)​ భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హాలీవుడ్​లో ఓ సినిమా సహా ఇక్కడ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Dhanush
ధనుశ్​
author img

By

Published : Jun 28, 2021, 1:35 PM IST

తమిళ స్టార్​ హీరో ధనుష్(Dhanush)​ వరుస హిట్​ సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇది కాకుండా ఆయన మరో విషయమై వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలోని పోయెస్ గార్డెన్​లో కొత్త ఇంటి కోసం ధనుష్ శంకుస్థాపన చేశారు. అయితే అత్యాధునిక వసతులతో రూ.150 కోట్లు ఖర్చుతో​ ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది! నాలుగు అంతస్థుల్లో ఈ ఇంటిని కట్టనున్నట్లు సమాచారం. అదే ప్రాంతంలో తన మామ సూపర్​స్టార్​ రజనీకాంత్​ కూడా ఉండటం విశేషం.

బాలీవుడ్​ బ్యూటీ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ కూడా తన ప్రియుడితో కలిసి ఉండేందుకు ముంబయిలోని ఖరీదైన జుహు ప్రాంతంలో రూ.175కోట్ల పెట్టి ఓ బంగళా కొనుగోలు చేయనుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. రష్మిక కూడా ముంబయిలో ఓ అపార్ట్​మెంట్​ను కొనుగోలు చేసి అక్కడికి మకాం మార్చింది.

ఇటీవల ధనుష్​.. 'జగమేతంత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం 'ది గ్రే మ్యాన్​'(హాలీవుడ్​), యువ దర్శకుడు కార్తిక్​ నరేన్​తో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు దర్శకుడు శేఖర్​ కమ్ములతో ఓ పాన్​ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు.

ఇదీ చూడండి: Dhanush: ధనుష్ తొలి​ తెలుగు సినిమా.. అదీ పాన్ ఇండియా కథతో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.