ETV Bharat / sitara

పవన్-రానా చిత్రంలో స్టార్ దర్శకుడు!

author img

By

Published : Jun 9, 2021, 10:02 PM IST

పవన్ కల్యాణ్(Pawan kalyan)​, రానా ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వి.వి వినాయక్ ఓ కీలకపాత్ర చేయనున్నారట. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది.

pawan
పవన్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ సూపర్‌హిట్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్' (Ayyappan Koshyum)కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భాగమయ్యారు. ఈ చిత్రానికి ఆయన మాటల రచయితగా వ్యవహరించనున్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం పవన్‌, రానా మూవీలో మరో పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ భాగం కానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఫ్యాక్షన్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొనే వి.వి.వినాయక్‌ ఈ చిత్రబృందంలో ఓ సభ్యుడు కానున్నారట. ఈ సినిమాలో ఆయన ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారట. రానాకు సలహా ఇచ్చే పాత్రను పోషిస్తున్నారట వినాయక్. ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చూడండి: ఈ 'అవెంజర్స్​' స్టార్..​ షారుక్​కు ఫ్యాన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.