థియేటర్స్‌లోనే సినిమాను విడుదల చేయాలన్న దృఢ సంకల్పంతో ఏడాదిన్నర పాటు 'సూర్యవంశీ' చిత్రాన్ని ఆపటం నిజంగా అభినందనీయమని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సూర్యవంశీ'. రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలకపాత్రలు పోషించారు. పోలీస్ నేపథ్యంలో సాగే యాక్షన్ కథతో రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. దీపావళి కానుకగా నవంబరు 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్ చేశారు.
-
Wishing #Sooryavanshi a grand success… Whole hearted appreciation to the team for holding the film for more than a year and a half to revive the theatre business in these tough times 👏🏻@akshaykumar #RohitShetty @ranveerofficial @ajaydevgn @karanjohar @dharmamovies @relianceent pic.twitter.com/vFERmrXPL0
— rajamouli ss (@ssrajamouli) November 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wishing #Sooryavanshi a grand success… Whole hearted appreciation to the team for holding the film for more than a year and a half to revive the theatre business in these tough times 👏🏻@akshaykumar #RohitShetty @ranveerofficial @ajaydevgn @karanjohar @dharmamovies @relianceent pic.twitter.com/vFERmrXPL0
— rajamouli ss (@ssrajamouli) November 3, 2021Wishing #Sooryavanshi a grand success… Whole hearted appreciation to the team for holding the film for more than a year and a half to revive the theatre business in these tough times 👏🏻@akshaykumar #RohitShetty @ranveerofficial @ajaydevgn @karanjohar @dharmamovies @relianceent pic.twitter.com/vFERmrXPL0
— rajamouli ss (@ssrajamouli) November 3, 2021
"సూర్యవంశీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. క్లిష్ట సమయాల్లో ఓపిక పట్టి, కేవలం థియేటర్‌లో మాత్రమే విడుదల చేయాలని ఏడాదిన్నర పాటు సినిమా ఆపినందుకు హృదయపూర్వక అభినందనలు" అని రాజమౌళి ట్వీట్ చేశారు.
రాజమౌళి ట్వీట్‌కు కరణ్ జోహార్ కృతజ్ఞతలు తెలిపారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: