ETV Bharat / sitara

ముచ్చటగా మూడోసారి షారుఖ్​-దీపిక రొమాన్స్

author img

By

Published : Oct 20, 2020, 2:38 PM IST

బాలీవుడ్​ ఎవర్​గ్రీన్​ మూవీ 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కథానాయకుడు షారుఖ్​ నటించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 'పఠాన్​' టైటిల్​ను ఖరారు చేశారు. ఇందులో షారుఖ్​, దీపికా పదుకొణెతో పాటు జాన్​ అబ్రహం కీలకపాత్ర పోషించనున్నారు.

SRK to be back in action with Pathan starring Deepika?
దీపికా పదుకొణె, షారుఖ్​ ఖాన్​

బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుఖ్​ఖాన్​ చాలా కాలం తర్వాత అభిమానులకు తాను నటించబోతున్న కొత్త సినిమా కబురు అందించారు. ఆయన నటించిన 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' సినిమా విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 'పఠాన్​' అనే టైటిల్​తో సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో షారుఖ్​ సరసన దీపికా పదుకొణె నటించనుండగా.. జాన్ అబ్రహం ఓ కీలకపాత్ర పోషించనున్నారు. నవంబరు నుంచి ప్రారంభం కానున్న చిత్రీకరణలో ఎస్​ఆర్​కే పాల్గొనబోతున్నారు. 2021 జనవరిలో దీపిక, జాన్​ అబ్రహం సెట్​లో అడుగుపెట్టనున్నారు.

ముంబయిలోని అంధేరి యుశ్​రాజ్​ ఫిల్మ్​ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్​ కోసం ప్రత్యేక సెట్​ రూపొందించనున్నారు. ఇందులో దాదాపుగా రెండు నెలల పాటు షారుఖ్​పై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించనున్న 'సంకీ' అనే కొత్త ప్రాజెక్టులో షారుఖ్​, దీపిక కలిసి నటిస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ, దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.