Srikanthaddala new movie: శ్రీకాంత్ అడ్డాల.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'కొత్త బంగారులోకం', సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇటీవల వెంకటేశ్‌తో 'నారప్ప' సినిమా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన ఓ స్టార్ హీరోతో మూవీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆయన ఓ కొత్త హీరోను తెలుగు తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారని తెలిసింది.
'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. తన కుటుంబం నుంచి ఓ హీరోను పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఆ బాధ్యతను శ్రీకాంత్‌కు అప్పగించినట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించి ఫిబ్రవరి లేదా మార్చిలో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట. ఇందులో హీరోయిన్ను కూడా కొత్త అమ్మాయినే తీసుకోనున్నారని తెలిసింది.
ఇదీ చూడండి: ఈ ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలివే!