టాలీవుడ్ దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా, గతడేది ఓ బయోపిక్ (ఎన్టీఆర్: కథానాయకుడు, మహానాయకుడు) వచ్చింది. ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్లో కనిపించి, ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని 'చదరంగం' అనే వెబ్ సిరీస్ తీస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
![CHADARANGAM WEB SERIES LOOK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6120073_chadarangam.jpg)
సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన, ఆయన సన్నిహితుల్లో అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఓ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. శ్రీకాంత్.. ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడు. మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. రాజ్ అనంత దర్శకత్వం వహిస్తున్నాడు. నాగినీడు, రవి ప్రకాశ్, చలపతిరావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది 'చదరంగం'.
ఇది చదవండి: సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పుట్టా.. అలా నటన వైపు వచ్చా