ETV Bharat / sitara

అరెరె.. మంచి సీన్ డిలీట్ చేశారే! - శ్రీదేవి సోడా సెంటర్ డిలిటెడ్ సీన్

సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులోని డిలీటెడ్ సీన్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Sridevi Soda Center
శ్రీదేవి సోడా సెంటర్
author img

By

Published : Aug 30, 2021, 4:39 PM IST

సినిమా నిడివి ఎక్కువయ్యే నేపథ్యంలో బాగున్న సన్నివేశాల్నీ తొలగించాల్సి వస్తుంది. అవే 'డిలీటెడ్‌ సీన్స్‌'గా అలరిస్తుంటాయి. వాటిని చూసిన తర్వాత 'అరే..! మంచి సన్నివేశాన్ని తొలగించారే' అని అనుకోవాల్సిందే. 'శ్రీదేవి సోడా సెంటర్‌' విషయంలోనూ ఇదే జరిగింది. సుధీర్‌బాబు కథానాయకుడిగా కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. ఆనంది కథానాయిక. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మేకింగ్‌ వీడియోలతోపాటు ఈ సినిమా నుంచి తొలగించిన ఓ కీలక సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు సుధీర్‌ బాబు.

ఈ చిత్రంలోని సూరిబాబు పాత్ర కోసం తానెంత కష్టపడ్డాడో మేకింగ్‌ వీడియోల్లో చూడొచ్చు. డిలీటెడ్‌ సీన్‌ విషయానికొస్తే.. జైలు నేపథ్యంలో అజయ్‌- సుధీర్‌ మధ్య సాగే సన్నివేశం ఇది. సుధీర్‌ భోజనానికి వస్తుండగా అక్కడే ఉన్న అజయ్‌ "రండి రండి రండి దయచేయండి... తమరి రాక మకెంతో సంతోషం సుమండి" అంటూ వ్యంగ్యంగా ఆహ్వానిస్తాడు. "నేను చెప్పిన పనిచేస్తే నాలుగు కూరలు, నాన్‌ వెజ్‌ వస్తుంది. లేకపోతే నాకు కోపం వస్తుంది" అంటూ సుధీర్‌ తినే భోజనం ప్లేట్‌లో అజయ్‌ ఉమ్మివేస్తాడు. ఈలోగా జైలు అధికారులు వస్తారు. తానేం చేయనట్టు యథావిధిగా "రండి రండి" అని అజయ్‌ ఆలపిస్తాడు. అంత చేసినా సుధీర్‌ ఎందుకో మౌనంగానే ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? సూరిబాబు మౌనానికి కారణం ఏంటి? అంటే సినిమా చూడాల్సిందే.

ఈ సీన్‌లో అజయ్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపించి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. సుధీర్‌, అజయ్‌.. ఇద్దరూ తమ సీరియస్‌ లుక్‌తో మెప్పిస్తున్నారు. 'ఈ సీన్‌ సినిమాలో ఉంటే బాగుండేది' అని ఈ వీడియో చూశాక మీకూ అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: కోమలి.. నిన్ను చూస్తే మనసు అంటోంది మసక్కలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.