సినిమా ఇండస్ట్రీలోకి చాలా నేర్చుకున్నానని సీనియర్ నటి శ్రీలక్ష్మి చెప్పారు. కెరీర్లో దాదాపు 500-600 చిత్రాల్లో నటించానని తెలిపారు. నటి హేమతో కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఈమె పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
'ఆ రోజుల్లో మనకు కష్టం వస్తే చెప్పుకోగానే తీర్చే వాళ్లుండేవారు. కానీ, ఈ రోజుల్లో అలా లేదనిపిస్తోంది.. నమ్ముతారో, నమ్మరో నా బాధను గోడలతో పంచుకుంటున్నా. ఒకానొక సమయంలో మా సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా.. ఇదొక్క షాట్ తీసి వెళ్లమన్నారు. ఆఖరికి నేను వెళ్లేలోపే ఆయన చనిపోయారు. అప్పుడు ఛీ.. ఈ బతుకు అవసరమా అనిపించింది' అని తన మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు నటి శ్రీలక్ష్మి.
శ్రీలక్ష్మిని తిట్టిన జంధ్యాల
'రామారావు-గోపాల్‌రావు' షూటింగ్ సందర్భంగా బస్ నుంచి దిగే సీన్లో నటిస్తుండగా చంద్రమోహన్ తనను చెవి దగ్గర కొట్టారని, దాంతో తనకు మైండ్ బ్లాంక్ అయిపోయిందని శ్రీలక్ష్మి చెప్పారు. నోటి నుంచి డైలాగ్ చెప్పకపోయేసరికి, దర్శకుడు జంధ్యాల తనపై మైక్‌లో అరిచి, తిట్టడం మొదలుపెట్టారని ఆమె ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని చూసే ఇండస్ట్రీలోకి వచ్చానని నటి హేమ అన్నారు. అలా ఇప్పటివరకు దాదాపు 475 సినిమాల్లో నటించానని వెల్లడించారు. అయితే కెమెరా ముందు నవ్వుతూ నటిస్తాం కానీ తమకు చాలా కష్టాలు ఉంటాయని చెప్పింది. 'దూకుడు' షూటింగ్ సమయంలో ఎమ్.ఎస్ నారాయణకు ఎదురైన అనుభవాన్ని పంచుకుని కన్నీటిపర్యంతమైంది.
హేమ మరో శ్రీలక్ష్మి కావాలని చెన్నై ట్రైన్ ఎక్కిందని అలీ చెప్పగా, అయ్యావు కదా అంటూ హేమను అభినందించారు శ్రీలక్ష్మి. తన జీవితం, కుటుంబం గురించిన విషయాల్ని పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">