ఈ ఏడాది థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 16(శుక్రవారం) విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.
చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయి? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా 'శ్రీకారం'. కిశోర్ బి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, ప్రియాంక జంటగా నటించారు. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 16) రోజున సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్ కానుంది.
-
The highly anticipated Telugu movie #Sreekaram is premiering tomorrow on #SUNNXT
— SUN NXT (@sunnxt) April 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Download the app right away and get ready to enjoy this emotional drama. @ImSharwanand @priyankaamohan #PremiereMovies #SreekaramOnSUNNXT #TeluguMoviesOnSUNNXT #MoviesOnSUNNXT pic.twitter.com/8dfQKjlUvt
">The highly anticipated Telugu movie #Sreekaram is premiering tomorrow on #SUNNXT
— SUN NXT (@sunnxt) April 15, 2021
Download the app right away and get ready to enjoy this emotional drama. @ImSharwanand @priyankaamohan #PremiereMovies #SreekaramOnSUNNXT #TeluguMoviesOnSUNNXT #MoviesOnSUNNXT pic.twitter.com/8dfQKjlUvtThe highly anticipated Telugu movie #Sreekaram is premiering tomorrow on #SUNNXT
— SUN NXT (@sunnxt) April 15, 2021
Download the app right away and get ready to enjoy this emotional drama. @ImSharwanand @priyankaamohan #PremiereMovies #SreekaramOnSUNNXT #TeluguMoviesOnSUNNXT #MoviesOnSUNNXT pic.twitter.com/8dfQKjlUvt
శ్రీ సింహా కోడూరి, మిషా నారంగ్, చిత్ర శుక్లా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 16(శుక్రవారం) తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో విడుదల కానుంది. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">