ETV Bharat / sitara

అందమైన భామలు నేర్పిస్తున్న వ్యాయామ చిట్కాలు

author img

By

Published : Mar 29, 2020, 10:14 AM IST

కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధమైన వ్యాయామాలు చేయాలో చెబుతున్నారు పలువురు హీరోయిన్లు. జిమ్​ లేకపోయినా, స్వీయనిర్బంధాన్ని ఆస్వాదించోచ్చని అంటున్నారు.

special story on actress fitness videos in social media
అందమైన భామలు నేర్పిస్తున్న వ్యాయామ చిట్కాలు

ఫిట్‌నెస్‌, పోషకాహారం, నిద్ర.. ఇవి ఆధునిక యుగంలో ఆరోగ్య మంత్రాలుగా మారాయి. చిన్న పిల్లల నుంచి వయసుపైబడిన వారి వరకు తమ జీవనశైలిలో వీటిని భాగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం ప్రత్యేకించి నటీమణుల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఓ విధంగా వారే తమ ఫాలోవర్స్‌కు ఆదర్శంగా ఉంటున్నారు.

ఫిట్‌నెస్‌ కోసం చేసే కసరత్తులను సోషల్‌మీడియాలో పంచుకుంటూ స్ఫూర్తిని నింపుతున్నారు. కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ తరుణంలో ఇంటిలోనే ఉంటూ వ్యాయామం చేయమని, రోగనిరోధక శక్తి పెంచుకోమని అభిమానులకు చెబుతున్నారు. స్వయంగా వాటిని వివరిస్తున్నారు. అలా మన తారలు పంచుకున్న ఫిట్‌నెస్‌ వీడియోలను చూసేద్దాం.

ఫిట్‌నెస్‌ అనగానే గుర్తొచ్చే కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కొవ్వు కరిగించాలంటే జిమ్‌ అవసరం లేదంటూ ఈ బ్యూటీ కసరత్తుల వీడియోను ఫాలోవర్స్‌తో పంచుకుంది. 'ఎవరు చెప్పారు.. శరీరంలోని కొవ్వును కరిగించాలంటే జిమ్‌కు వెళ్లాలని. ఇప్పుడు మీ అందరికీ ఎంతో సమయం ఉంది. ఓ 30 నిమిషాలు ఇలా కసరత్తులు చేయండి. మీరు ఇంట్లో చేసిన వర్కౌట్స్‌ వీడియోను నాకు షేర్‌ చేయండి' అని రకుల్‌ పేర్కొంది.

ముద్దుగుమ్మ అమీ జాక్సన్‌ ఇటీవలే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటుంది. తల్లయిన తర్వాత అమీ బాగా బరువు పెరిగింది. ఆ తర్వాత కసరత్తులు చేసి బరువు తగ్గి మునుపటిలా నాజూకుగా మారింది. స్వీయ నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో ఇంటిలోని మెట్లను ఉపయోగించి ఎలా కసరత్తులు చేయాలో చూపిస్తూ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేసింది.

'హార్ట్‌ఎటాక్‌' భామ అదా శర్మలో నటనతోపాటు అనేక కళలు ఉన్నాయి. ఆమె ఇప్పటికే ఫిట్‌నెస్‌, కరాటే చేస్తున్న వీడియోలు, పియానో వాయిస్తున్న వీడియోనుల పోస్ట్‌ చేసింది. ఇంటి పనిచేస్తే మన శరీరానికి ఎంతో వ్యాయామం లభిస్తుందంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. స్వయంగా ఇంటి పనిచేస్తూ తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తోంది.

మిల్కీబ్యూటీ తమన్నా తన గార్డెన్‌లో యోగా చేస్తుండగా తీసుకున్న వీడియోను షేర్‌ చేసింది. ఆరోగ్యం కోసం కసరత్తులు చేయాలని సూచించింది. తన యోగా పోజులను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంది.

కథానాయిక శిల్పా శెట్టి 25 ఏళ్ల వయసులో ఎలా ఉందో.. ఇప్పుడు అంతే అందంగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే దీనికి కారణం అంటోందీ నటి. స్వీయ నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో జిమ్‌ పరికరాలు లేకపోయినా ఇంట్లోనే చక్కగా వ్యాయామం చేయొచ్చని చెప్తుంది. ఇంటిలోని మెట్లపై కసరత్తులు చేస్తున్న వీడియోను తాజాగా షేర్‌ చేసింది. వారంలో కనీసం నాలుగుసార్లు వ్యాయామం చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పింది. అంతేకాదు స్వీయ నిర్బంధం సమయంలో ఇంటిలో పనిచేసే వారి విలువ తెలిసిందంటూ, శుక్రవారం మరో వీడియోను పోస్ట్​ చేసింది. తన గార్డెన్‌లో ఉన్న చెత్తను తోస్తూ, మొక్కలను నీరు పట్టింది. ఇదీ ఓ విధమైన కసరత్తేనని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ సుందరి కత్రినా కైఫ్‌ ఇంట్లో ఉంటూనే తెగ కసరత్తులు చేస్తోంది. సామాజిక దూరం పాటిస్తూనే ఫిట్‌గా తయారవొచ్చని ఫాలోవర్స్‌కు సూచించింది. తను, ట్రైనర్‌ యస్మికా కరచియాలా వర్కౌట్‌ చేస్తున్న వీడియోలను పంచుకుంది. ఏ వర్కౌట్‌ ఎంత సమయం చేయాలి, ఎన్ని సార్లు చేయాలో అందులో వివరించింది.

నటి సారా అలీ ఖాన్‌.. స్వీయ నిర్బంధంలో ఉంటూనే ఇంకా ఫిట్‌గా తయారవుతోంది. లాక్‌డౌన్‌కు మద్దతు చెబుదామని ఫిట్‌నెస్‌ను వదలనని, ఇన్‌స్టాలో వర్కౌట్‌ వీడియోను పోస్ట్​ చేసింది. అందరూ ఫిట్‌గా, జాగ్రత్తగా ఉండాలని కోరింది.

కథానాయిక కాజల్‌ తన నివాసంలోనే కసరత్తులు చేస్తుంది. తండ్రితో కలిసి వాకింగ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసింది. ఇంటిలోనే నడవాల్సిన సమయమిదని పేర్కొంది. స్వీయ నిర్బంధం నేపథ్యంలో సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి వర్కౌట్‌ చేశానని మరో వీడియో పోస్ట్​ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపమని, పరిశుభ్రంగా ఉండమని కోరింది.

బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు యోగా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా చెప్పింది. వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచే వర్కౌట్‌ ఇదేనంది. 'ఇది సూర్య నమస్కారం.. 20 నిమిషాల్లో 20 సార్లు ఈ వర్కౌట్‌ చేయొచ్చు. ఇది గొప్ప వ్యాయామం. నేను 108 చేస్తా. యోగా మన జీవితాల్ని కాపాడుతుంది' అంటూ మరో వీడియోను పంచుకుంది.

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. తన ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తుంది. స్వీయ నిర్బంధంలో కసరత్తులు అంటూ.. ఉష్ట్రాసనం పోజును షేర్‌ చేసింది. ఇది చాలా కష్టమని, శరీరం, మనసును ఒక్కచోటుకు చేరుస్తుందని ఆమె తెలిపింది.

ఇదీ చూడండి.. 'మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.