1993లో ఉన్న అమ్మాయి.. 2019లో కనెక్షన్ లేని ల్యాండ్ లైన్ ఉన్న అబ్బాయికి ఫోన్ చేసి ఎలా మాట్లాడింది? అనే కథతో తీసిన సినిమా 'ప్లే బ్యాక్'. సుకుమార్ తెరకెక్కించిన 'వన్ నేనొక్కడినే', '100 పర్సంట్ లవ్' చిత్రాలకు కథ అందించిన హరిప్రసాద్ జక్కా ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'ప్లే బ్యాక్' కథానాయకుడు దినేష్ తేజ చిత్ర విశేషాలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
బాలకృష్ణ 'ఆదిత్య 369', సూర్య '24' సినిమాల్లా కాకుండా వేర్వేరు కాలాల్లోని మనుషుల మధ్య జరిగే సంఘర్షణ 'ప్లే బ్యాక్' లో కనిపిస్తుందని తెలిపారు. ఇందులో కీలకంగా నిలిచే ల్యాండ్ లైన్ ఫోన్ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.
ఇది చదవండి: 'వన్ నేనొక్కడినే'కు కథ.. 'ప్లే బ్యాక్'తో దర్శకుడిగా