ETV Bharat / sitara

KondaPolam movie: అడవి మలచిన యువకుడి కథ - కొండపొలం ట్రైలర్​

కొండపొలం నవల(kondapolam novel) ఆధారంగా తెరకెక్కిన సినిమా 'కొండపొలం'. భయం, బిడియంతో నలిగిపోతున్న ఓ యువకుడిని అడవి ఎలా ధైర్యవంతుడిగా మార్చిందనేది ఈ మూవీ కథాంశం. వైష్ణవ్​తేజ్​, రకుల్​ప్రీత్​ సింగ్​ నాయకానాయికలు. ఈ సందర్భంగా నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చిత్ర విశేషాలను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

kondapolam
కొండపొలం
author img

By

Published : Oct 2, 2021, 6:37 AM IST

ఒక నవల(kondapolam novel)... సినిమాగా వచ్చి ఎన్ని రోజులైంది? మట్టి పరిమళాన్ని వెండితెర అద్దుకొని ఎన్నేళ్లైంది? మనిషి తనకు అనుకూలంగా ప్రకృతిని ఎలా మార్చుకుంటున్నాడో... అలా ప్రకృతి కూడా మనిషిని మలుస్తుందని ఎంతమందికి తెలుసు? ఏ మనిషికైనా చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులకన్నా గురువులెవరుంటారు? వీటన్నింటికీ సమాధానం చెబుతూ వస్తోంది 'కొండపొలం' చిత్రం(kondapolam movie). ఇదే పేరుతో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్‌. పంజా వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌(vaishnav tej kondapolam) నాయకానాయికలు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేసిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'కొండపొలం'(kondapolam story) నవల చదివిన దర్శకుడు క్రిష్‌ ఒకసారి నాకు ఫోన్‌ చేశారు. ఆయన ఇంటికి ఆహ్వానించారు. అక్కడ ఈ నవల గురించి మొదటిసారి మేమిద్దరం చర్చించుకున్నాం. 'నవలలోని సారాన్ని ఏ మాత్రం తీసేయకుండా... కొన్ని మార్పులు చేర్పులతో సినిమా చేయాలనుకుంటున్నాం' అన్నారు. నేను అంగీకరించాను. దానికి తగ్గట్లే తీశారు. పుస్తకం చదివిన పాఠకుడు ఎంత సంతృప్తి పడతాడో... సినిమా చూసిన ప్రేక్షకులూ అంతే ఆనందాన్ని పొందుతారు.

మనం భూమిని సాగుచేసి పంటను పండిస్తే... దాన్ని పొలం అంటాం. అదే సహజసిద్ధంగా ప్రకృతే పంటను ఇచ్చే ప్రదేశాన్ని 'కొండపొలం' అంటాం(kondapolam movie poster). అడవిలో ఆ ఫలాన్ని పొందడానికి గొర్రెల కాపారుల చేసే ప్రయాణాన్నే 'కొండపొలం' అంటారు. ఈ పదం కడపజిల్లా పోరుమామిళ్ల, జ్యోతి... ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో వారికే తెలుసు. మొదట సినిమాకు 'వనవాసి' అనే టైటిల్‌ పెట్టాలనుకున్నారు. స్థానికతను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుండటం వల్ల చివరికి దర్శకుడు క్రిష్‌ 'కొండపొలం' అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ చిత్రాన్ని మొదట నల్లమల ప్రాంతంలోనే తీయాలని ప్రణాళిక వేశారు. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో వేరే చోట తీయాల్సి వచ్చింది. పైగా నల్లమల టైగర్‌ జోన్‌ కావడం వల్ల అనుమతులు క్లిష్టమయ్యాయి. విజువల్స్‌ చూస్తే... నల్లమల ప్రాంతం లాగే అనిపించేలా చేశారు. సంగీతం, గ్రాఫిక్స్‌ చిత్రానికి అదనపు బలాన్ని తీసుకొచ్చాయి. మాండలికం నేర్చుకోవడానికి అందరూ చాలా కృషి చేశారు. నటులందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు క్రిష్‌(kondapolam movie director). నవలలో కథానాయిక పాత్ర ఉండదు. సినిమా కోసం దాన్ని ప్రత్యేకంగా రాశాం. నవలలోని పుల్లయ్య పాత్ర మనవరాలిగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాత్ర ఉంటుంది.

భయం, బిడియంతో నలిగిపోతున్న రవీంద్రయాదవ్‌ అనే యువకుడిని అడవి ఎలా ధైర్యవంతుడిగా మార్చిందనేది కథాంశాం. మొట్టమొదట ఈ నవలకు తానా జంపాల చౌదరి నుంచి ప్రశంసలందాయి. అప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. మా ప్రాంతం నేపథ్యం, ఇక్కడి మనుషుల జీవన విధానం, అందులోని పోరాటం... అంతమందికి నచ్చడం చాలా గొప్ప విషయం. దీన్ని ఇప్పుడు చిత్రంగా తీస్తుండటం వల్ల ఇంకా సంతోషంగా ఉంది. మా ప్రాంత ప్రజలంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మంచి కథ పుట్టడానికి కారణమైన ఇక్కడి గొర్రెల కాపారులకు, ఈ ప్రాంతానికీ మనసారా కృతజ్ఞతలు చెబుతున్నా.

ఇదీ చూడండి: 'లైగర్' కోసం దిగ్గజ బాక్సర్​​.. ఆసక్తిగా 'కొండపొలం' ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.