ETV Bharat / sitara

చిరుతో ఖరారు కాలేదు.. తారక్​తో ప్రకటిస్తా: త్రివిక్రమ్ - అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్

త్రివిక్రమ్.. తన డైలాగులతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు.. ఆలోచనలోనూ పడేస్తారు. పగిలిపోయే పంచ్​లతో పాటు.. మనసుకు హత్తుకునే మాటలతోనూ మాయచేయగల దర్శకుడు. తాజాగా ఆయన తెరకెక్కించిన అల.. వైకుంఠపురములో సినిమా ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ముఖాముఖిలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Special Chit Chat With Trivikram Director
త్రివిక్రమ్
author img

By

Published : Jan 11, 2020, 7:58 AM IST

సినిమాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనెప్పుడూ చదవను. ముందు చదవడాన్ని ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. అయితే మనం చదివింది, విన్నది, మాట్లాడింది ఎక్కడో ఒక చోట ఉపయోగ పడుతుంది అని అంటున్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. రచయితగా ప్రయాణం ప్రారంభించిన ఆయన తెలుగు సినిమా మాటల్ని కొత్త పుంతలు తొక్కించారు. మాటకి ఇంత శక్తి ఉందని మరోమారు మాట్లాడుకునేలా చేశారు. దర్శకుడిగా మారాక మాటలతోనే కాకుండా, కథలతోనూ ఆయన కలం మెరుపులు మెరిపిస్తోంది. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన అల.. వైకుంఠపురములో చిత్రం ఈ నెల 12న వస్తోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్రివిక్రమ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ.

ఈమధ్య మీ సినిమాల పేర్లన్నీ 'అ' అక్షరంతోనే మొదలవుతున్నాయి...

నాకూ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ ఈ సెంటిమెంట్‌ అయితే లేదు. ఇదివరకు వేరే అక్షరాలతో మొదలైన సినిమాలూ తీశాను కదా. ఈమధ్య 'అ' అక్షరంతో కుదురుతున్నాయంతే. పోతన రాసిన పద్యం స్ఫూర్తితో ‘అల.. వైకుంఠపురములో’ అని ఈ సినిమాకు పేరు పెట్టాం.

అత్తారింటికి దారేది నుంచి మీ సినిమా కథలు ఎక్కువగా ఇంటిచుట్టూ, కుటుంబం చుట్టూనే నడుస్తున్నాయి. కారణమేంటి?

మనం ప్రపంచమంతా తిరగొచ్చు కానీ, ఇంటికి వచ్చేసరికి సుఖంగా ఉంటుంది. అది రెండు గదుల ఇల్లే కావొచ్చు. కానీ దాంట్లో ఉండే ఆనందం వేరు. ఒక కథకుడిగా ఆ ఆనందాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నానేమో. ఈ సినిమా చూశాక ఆ ఇంటికి, ఆ స్థానానికి ఉన్న విలువ తెలుస్తుంది. ఇందులో కథానాయకుడు డ్రామా కోసం ఇంటికి వెళ్లడు. అసలు అది తనకెందుకు ముఖ్యమైందనేది సినిమా చూశాకే తెలుస్తుంది. అందుకే ఆ ఇంటికి వైకుంఠపురం అని పేరు పెట్టి, ఆ పేరే సినిమాకి పెట్టాం.

Special Chit Chat With Director Trivikram
త్రివిక్రమ్

ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి అనుభూతినిస్తుంది. దర్శకుడిగా మీరెలాంటి అనుభూతికి గురయ్యారు?

పరిపూర్ణమైన అనుభూతితో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. ఇక నా అనుభూతి అంటారా? చీర నేసిన వ్యక్తికి ఆ ప్రయాణంలో దాని అందం తెలియదు. దాన్ని ప్రతిసారీ దూరం నుంచి చూసుకుంటూ నేయడు. ఒక అనుభూతితో టకటకా నేసుకుంటూ వెళుతుంటాడు. ప్రస్తుతం నేనలాంటి అనుభూతిలోనే ఉన్నా.

అరవింద సమేతతో ఒక కొత్త రకమైన జోనర్‌లోకి వెళ్లారు. ఈ సినిమాతో మళ్లీ ఆ దారిని మార్చినట్టు కనిపిస్తోంది. కారణం?

ఎవరైనా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు వాళ్ల ఆలోచనల్ని అందరికీ చెప్పాలి, అది విని వాళ్లంతా మెచ్చుకోవాలి, ఆ ఆలోచనలతో అందరూ ఏకీభవించాలనుకుంటారు. కొన్నాళ్ల తర్వాత జనం కానీ, మీడియా కానీ వీళ్లెలాగూ బాగా చెబుతారు కదా అని మెచ్చుకోవడం తగ్గించేస్తారు. మెచ్చుకోవడం తగ్గడం మూలంగా అవతలివ్యక్తికి మన పనిలో ఏమైనా లోపం ఉందా అని అనుకుంటూ వేరే దారుల్లోకి వెళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయే అవకాశాలుంటాయి. రెండో విషయం.. వాళ్లపై అంచనాలు పెరిగిపోయి చెప్పాలనుకున్నది చెప్పలేక మళ్లీ మామూలుగా, సేఫ్‌ రూట్‌లో వెళ్లే ప్రమాదం ఉంది. ఏ రంగంలో ఉన్నవాళ్లయినా ఈ రెండింటినీ ప్రతిసారీ గెలవడానికి ప్రయత్నిస్తుంటారు. నేనూ ఆ భయాల్ని గెలవాలనే ప్రయత్నిస్తుంటా. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత అందరూ ‘మీకు అలవాటైన వినోదం వైపు వెళితే ఉత్తమం కదా’ అన్నారు. నేనది చేయలేదు. పరాజయం చూశాక ఇక కొత్తగా భయపడాలా? ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం అని అరవింద సమేత చేశా. ఇప్పుడు మళ్లీ అదే కథ చెప్పకూడదు కదా.

ఒక సినిమా చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దర్శకుడిగా మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళుతుందో ఒక అంచనాకొస్తుంటారా?

అలాంటి విషయాల గురించి అస్సలు ఆలోచించను. కథ రాసేంత వరకే దానికి రాజుని నేను. ఆ తర్వాత అది చెప్పినట్టు వినాల్సిందే. అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి కారులో వెళుతుంటే, పక్కన పరిగెత్తుకుంటూ వెళుతున్న కుర్రాడి మీద బురద పడిందని రాసుకున్నాక... ఆ సన్నివేశం కోసం బురద ఉన్న రోడ్డుని వెతకాల్సిందే, రాత్రిపూటచిత్రీకరణ చేయాల్సిందే.

ఇదివరకు మీ సినిమాల్లోని నాయికల పాత్రల విషయంలో విమర్శలొచ్చాయి. ఇటీవల మహిళల పాత్రల్ని గొప్పగా చూపిస్తున్నారు. ఈ మార్పుకి కారణం?

విమర్శ వల్ల వచ్చిన మార్పు కాదిది. ‘ఖలేజా’ సినిమాలో హీరోయిన్‌ పాత్రని అలా తీర్చిదిద్దానంటే అది వినోదం కోసమే. ఇప్పుడు కూడా మహిళల్ని పొగడటమంటూ ఏమీ లేదు. పుట్టించే శక్తి భూమికీ, ఆడవాళ్లకి ఉందని ఇందులో రాశానంటే అది నిజం కాబట్టి. 1950, 60 వరకు కూడా మనుషులు దూర ప్రాంతాలకి వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చేవరకూ ఆడవాళ్లే కుటుంబాలకి పెద్దగా ఉండేవారు. ఎవరూ చెప్పని మాతృస్వామ్యం. 70వ దశకం తర్వాత వేరే ప్రాంతాలు, దేశాలకి వెళ్లి ఉద్యోగాలు చేయడం ఎక్కువయ్యాక మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమయ్యాం. మన మూలాల్ని మనం మర్చిపోయాం. ఆడవాళ్లని అగౌరవపరిచేలా చూడటం, వాళ్లూ మౌనంగా ఉండటంతో అదే అలవాటైంది. అలా 35 ఏళ్లు నడిచింది. ఇప్పుడు మళ్లీ మార్పు కనిపిస్తోంది. నాకు మా అత్త అంటే చాలా ఇష్టం. అలాంటి అత్తతో ఎందుకు వేళాకోళమాడాలి? ఎందుకు తెరపై తక్కువ చేసి చూపించాలి? అది మన సంస్కృతిలో లేదు, తీసుకొచ్చి పెట్టారు. అల్లుడిని విష్ణువుగా భావించి పెళ్లిపీటలపై కాళ్లు కడుగుతారు. అలాంటప్పుడు దేవుడిలాగే ఉండాలి. బహుశా ఇలాంటి చికాకులు నాలో ఉండొచ్చు. అందుకే ‘అత్తారికింటి దారేది’ సినిమాని తీశాను.

త్రివిక్రమ్‌లా రాయాలనీ, త్రివిక్రమ్‌లా రాశారనే మాటలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంటాయి. ఏదైనా సినిమా చూసినప్పుడు మీలాగే రాసినట్టు అనిపించిందా?

ఎలాంటి బరువు లేకుండా నేను సినిమాల్ని చూస్తుంటా. ఒక దర్శకుడిగా సినిమా కష్టాలు తెలుసు కాబట్టి కొన్ని సన్నివేశాల్ని చూసి ఇదెలా తీశారని ఆశ్చర్యపోతుంటా. ఇంకొన్ని చూసినప్పుడు ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదని ఈర్ష్య కలుగుతుంది. అంతే తప్ప నాలాగా రాశారని నాకెప్పుడూ అనిపించలేదు. ముందు కథ, పాత్రలు, సన్నివేశాలు. ఆ తర్వాతే మాట వస్తుంది. సన్నివేశాల్ని సూటిగా చెప్పడానికి మాట వాడుతుంటానంతే. అందుకే మాటల పరంగా నాకు అంత పేరు వచ్చిందేమో.

చిరంజీవితో సినిమాని ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. నిజమేనా?

చిరంజీవితో సినిమా ఇంకా ఖరారు కాలేదు. ఎన్టీఆర్‌తో సినిమా అధికారికంగానే ప్రకటిస్తా.

ఇదీ చదవండి: జనవరి 13న ఆస్కార్‌ నామినేషన్ల వివరాలొస్తాయ్​..

ZCZC
PRI DSB ESPL NAT NRG
.NEWDELHI DES45
JNU-HINDU SENA-BANNERS
Anti-left banners come up near JNU; Hindu Sena claims responsibility
         New Delhi, Jan 10 (PTI) Anti-left banners bearing strong slogans surfaced in the streets neighbouring the JNU campus on Friday, with a fringe right-wing group claiming responsibility for mounting them.
         Students of the JNU said the banners have "vitiated the atmosphere" when the environment is already not very conducive.
         Vishnu Gupta, president of Hindu Sena, said, "We put up the banners, around the streets near JNU."
         "Many students sympathise with Naxals and anti-national activities. So in the name of protests over fee hike, they are obstructing education of other fellow students," he alleged.
         A masked mob went on a rampage in JNU on Sunday, attacking students and teachers with shovels and stones.
         The slogans on the banners played on the oft-repeated cry of the JNU protesters -- 'Hume Chahiye Azadi...' and read -- 'Desh ke dushmano se Azadi, Maoists, terrorists se Azadi', among others.
         The JNU students' union has been demanding a rollback of hostel and mess fee hike, and has boycotted registration for the next semester. PTI KND
ZMN
01102052
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.