ETV Bharat / sitara

బాలయ్య నిబద్ధత గల హీరో: కేఎస్ రవికుమార్ - Ruler Movie

స్టార్​ హీరోలందరితో పనిచేసి అగ్రదర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కేఎస్ రవికుమార్. బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రూలర్'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు రవికుమార్.

Special Chit Chat with Director K.S. Ravikumar
బాలయ్య నిబద్ధత గల హీరో: కేఎస్ రవికుమార్
author img

By

Published : Dec 19, 2019, 8:07 AM IST

స్టార్‌ హీరోలే కాదు... దక్షిణాదిలో స్టార్‌ దర్శకులూ బోలెడుమంది. ఆ జాబితాలో తొలి వరసలో కనిపించే దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, చిరంజీవి, బాలకృష్ణ... ఇలా దక్షిణాదిలో ఎంతోమంది అగ్ర హీరోలతో సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నారాయన. ఇటీవల బాలకృష్ణతో ‘రూలర్‌’ తెరకెక్కించారు. సి.కల్యాణ్‌ నిర్మించిన ఆ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్‌.రవికుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

హీరోల ఇమేజ్ బట్టే కథ ఎంపిక..

కథానాయకుల ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకునే కథల్ని ఎంపిక చేసుకుంటా. జై సింహా తర్వాత ఈ విరామంలో 8 తమిళ సినిమాల్లో నటించా. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా చేశా. అక్కడ నటన, ఇక్కడ దర్శకత్వం చేస్తుంటా.

బాలయ్య 3 గంటలకే లేచేవాడు..

బాలకృష్ణకి తగ్గ కథ 'రూలర్'. పరుచూరి మురళి ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌ నేపథ్యంలో ఉంటుంది. బాలకృష్ణ ఎన్ని గెటప్పుల్లో కనిపిస్తారనేది తెరపైనే చూడాలి. ఐటీ అధికారి పాత్ర కోసం ఆయన నెలన్నరలో బరువు తగ్గి సన్నబడ్డారు. 3 గంటలకే లేచి ఎంతో నిబద్ధతతో తన లుక్‌ని మార్చుకున్నారు. అది ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. కథానాయికలతో సహా అందరూ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు.

Special Chit Chat with Director K.S. Ravikumar
కేఎస్ రవికుమార్

'స్నేహం కోసం' 45 రోజుల్లో తీశా..

రజనీకాంత్‌ సహా అగ్రహీరోలందరితోనూ చేశా. శ్రద్ధగా పనిచేయడమే విజయ రహస్యమని నమ్ముతా. బాలకృష్ణ సెట్‌లో చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 10న మొదలుపెట్టి డిసెంబరు 10న సెన్సార్‌కి తీసుకెళ్లా. ప్రణాళిక, అనుభవంతోనే వేగంగా సినిమాలు చేయగలుగుతాం. 'స్నేహం కోసం' సినిమాని అప్పట్లో 45 రోజుల్లో పూర్తి చేశా. ఆ సినిమా చేస్తూనే 'నరసింహ' డైలాగుల్ని రాసుకున్నా.

ఆ సినిమాలు అందుకే హిట్టయ్యాయి..

మంచి నటన, కామెడీ, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఉన్నప్పుడే సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఆ ఆలోచనని దృష్టిలో పెట్టుకొనే 'నరసింహ', 'భామనే సత్యభామనే', 'దశావతారం' లాంటి సినిమాలు చేశా.

ఆ సినిమా ఎప్పుడు వీలవుతుందో..

నా కథతో వచ్చిన ఏకైక చిత్రం 'కోచ్చడయాన్‌'(తెలుగులో విక్రమ సింహా). దానికి నేను దర్శకుణ్ని కాదు. దానికి ముందు రజనీతో ‘రాణా’ చేయాలనిఅనుకున్నాం. కానీ ఆ కథ తెరకెక్కాలంటే దానికి ప్రీక్వెల్‌గా 'కోచ్చడయాన్‌' చేయాలని అనుకున్నాం. అయితే రజనీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ‘కోచ్చడయాన్‌’ని యానిమేషన్‌లో చేశాం. ఇప్పటికీ నా దగ్గర 'రాణా' కథ ఉంది. అది చేయడానికి పెద్ద బడ్జెట్‌ కావాలి. రజనీమరో సినిమా చేశాక రాజకీయాల్లోకి వెళతారు. మరి ఆ కథతో సినిమా చేయడం అవుతుందో లేదో చూడాలి. కమల్‌తో ఐదు సినిమాలు చేశా. రజనీ, కమల్‌ రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్లు ప్రజలకి మంచే చేస్తారు.

రవితేజతో కుదరలేదు..

తెలుగులోనూ నటించే అవకాశాలు వచ్చాయి. రవితేజతో ఓ సినిమా చేయాల్సింది కానీ అది కుదరలేదు. నవతరం దర్శకులు మంచి ప్రతిభని ప్రదర్శిస్తున్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం రూలర్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, ఫస్ట్​లుక్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.

ఇదీ చదవండి: పవన్​ 'పింక్​'లో మరో యువ హీరోయిన్?

AP Video Delivery Log - 0100 GMT News
Thursday, 19 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0059: US CA Stolen Airplane Arrest Part must credit Fresno Yosemite International Airport; Part must credit KMPH, No access Fresno, No use US broadcast networks, No re-sale, re-use or archive 4245410
Police: teen steals plane, hits airport fence
AP-APTN-0032: Australia Fires Emergency No access Australia 4245409
NSW gov declares state of emergency over bushfires
AP-APTN-0019: US CA Cocaine Seizures Part: must credit KFMB ; No access San Diego market; No use US broadcast networks; No re-sale, re-use or archive Part: Must credit US Coast Guard Pacific Area 4245408
US Coast Guard seizes cocaine worth millions
AP-APTN-0008: US MI Trump Rally Supporters AP Clients Only 4245407
Mich. Trump supporters slam impeachment vote
AP-APTN-2359: Spain Catalonia Reax AP Clients Only 4245406
Tension in Barcelona amid clashes outside stadium
AP-APTN-2350: US MI Barr Violent Crime Must credit WXYZ; No access Detroit market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4245405
Barr announces crackdown on crime in 7 cities
AP-APTN-2349: UN Mideast AP Clients Only 4245404
UN: Israel housing building 'of serious concern'
AP-APTN-2342: Chile Protest AP Clients Only 4245403
Tear gas used as Chile protests hit 2-month mark
AP-APTN-2328: Brazil Santa Claus AP Clients Only 4245402
Rio children with cancer greeted by jet ski Santa
AP-APTN-2322: US Impeach Schiff Amash Gaetz AP Clients Only 4245401
House nears nighttime impeachment vote
AP-APTN-2318: Brazil Belo Monte Dam AP Clients Only 4245400
Brazil Amazon dam: broken promises for distant power
AP-APTN-2310: US OR Shopping Centre Stabbing KPTV - must credit; no access Portland; no use US broadcast networks; no re-sale, re-use or archive 4245399
One killed, others hurt in Oregon stabbing attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.