ETV Bharat / sitara

సినిమా కష్టాలకు 'తెర' తొలగేదెప్పుడు? - సేవ్​ మూవీ థియేటర్స్​ ఉద్యమం

కరోనా కారణంగా సినిమాహాళ్లు తెరుచుకోక దాదాపు ఐదున్నర నెలలు గడిచాయి. అన్​లాక్ నాలుగవ దశలో మెట్రోరైళ్లు, పరిమితంగా రాజకీయ సమావేశాలకు సడలింపులు ఇచ్చింది కేంద్రం. అయితే ఎంతోమందికి జీవనోపాధి పొందుతోన్న థియేటర్లను తెరవడానికి మాత్రం అనుమతించలేదు. దీంతో 'సపోర్ట్‌ మూవీ థియేటర్స్‌' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం జరుగుతోంది.

Special article on the hardships of theater workers
సినిమా కష్టాలకు 'తెర' తొలగేదెప్పుడు?
author img

By

Published : Sep 1, 2020, 7:08 AM IST

మనసు బాగోలేదా?.. కాళ్లు అప్రయత్నంగా సినిమా హాల్‌వైపు మళ్లుతాయి. స్నేహితులు కలిశారా? కొత్త బొమ్మ ఏముందని కళ్లు ఆరా తీయడం మొదలుపెడతాయి. సెలవొచ్చిందా? కుటుంబమంతా కలిసి టికెట్టు బుక్‌ చేసుకోవాల్సిందే.

సినిమా ఓ మాయా ప్రపంచం. రెండున్నర గంటలపాటు ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. మన బాధల్ని, ఒత్తిళ్లని మాయం చేసేలా వినోదాన్ని పంచుతుంది. అందుకే మన జీవితాల్లో సినిమా ఓ భాగమైపోయింది. అప్పుడప్పుడైనా థియేటర్‌లోకి అడుగు పెట్టకపోతే చాలా మందికి ఏదో తెలియని వెలితి. అలాంటి సినిమా థియేటర్‌ ఐదున్నర నెలలుగా తెరచుకోనేలేదు.

థియేటర్లో ప్రొజెక్టర్‌ నుంచి తెరపైకి కాంతి ప్రసరించిందంటే చాలు.. చాలా జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నట్టే లెక్క. అక్కడ సందడి కనిపించిందంటే చాలు.. సినిమాని నమ్ముకున్న బతుకుల్లోనూ సందడి ఉన్నట్టే లెక్క. అలాంటి థియేటర్‌ తన కళని కోల్పోయింది.

కరోనా తీవ్రత వల్ల తెరపై బొమ్మ పడిందే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే 1600కిపైగా థియేటర్లు మూతపడిపోయాయి. 80 వేల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. దేశవ్యాప్తంగా అయితే 20 లక్షల మంది జీవితాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దాంతో 'సేవ్‌ సినిమా' పేరుతో ఉద్యమం ఊపందుకుంది. "సపోర్ట్‌ మూవీ థియేటర్స్‌" అంటూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సామాజిక మాధ్యమాల్లో తన వాణిని గట్టిగా వినిపిస్తోంది.

ప్రభుత్వాలు షాపింగ్‌ మాల్స్‌కు, విమానయానాలు, మెట్రోరైళ్లు ఇతరత్రా ప్రయాణాలకు అనుమతిచ్చినా.. థియేటర్లకి అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తారలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. వెండితెర వెలిగితేనే తమ జీవితాలపై పడిన తెర తొలగినట్టని కార్మికులు అంటున్నారు.

సగటున 50 మంది

కరోనాతో సినిమా ప్రదర్శన రంగం కుదేలైంది. ఒక్కో థియేటర్‌పై ప్రత్యక్షంగా పరోక్షంగా సగటున యాభై మంది ఉపాధి పొందుతుంటారు. మల్టీప్లెక్స్‌ థియేటర్‌ అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. థియేటర్లు మూత పడటం వల్ల ఆరంభంలో కొన్నాళ్లపాటు పూర్తిస్థాయి జీతాలు ఇచ్చిన యాజమాన్యాలు, ఆ తర్వాత తగ్గిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కొంతమందిని తొలగించారు. దాంతో పలువురి జీవితాలు రోడ్డున పడ్డాయి.

లాక్‌డౌన్‌ ముగిశాక తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను తెరుచుకునే అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రేక్షకులు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో 25 శాతం మంది ప్రేక్షకులు మాత్రమే సినిమాల్ని చూసేలా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ప్రభుత్వాల నుంచి అనుమతులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపైన ఆధారపడిన విషయం కాబట్టి అక్కడ ఒత్తిడి తెచ్చేందుకు థియేటర్ల యాజమాన్యాలు నడుం బిగించాయి.

సినిమాలున్నాయా? లేవా?

ఇప్పుడు థియేటర్లను తెరిస్తే ప్రదర్శనకు తగినన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయా? ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ధైర్యం చేస్తారా? ఈ ప్రశ్నలే పరిశ్రమను ఆలోచనలో పడేస్తున్నాయి. కొంతమంది ప్రదర్శనకారులు థియేటర్లు తెరవాలని, మరికొంతమంది ఇప్పుడే వద్దనే వాదనని వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లు లీజు విధానంలో కొద్దిమంది చేతుల్లో ఉన్నాయి. అలా థియేటర్లను లీజుకు తీసుకున్న ప్రదర్శనకారులేమో తగినంత మంది ప్రేక్షకులు రాకపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు.

థియేటర్లు తెరుచుకుంటే ఒకొక్క థియేటర్‌కు నెలకి రూ.4 లక్షలు చొప్పున యజమానులకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కరోనా భయం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో థియేటర్లని తెరవకపోవడమే ఉత్తమమని వాళ్లు భావిస్తున్నారు. సొంతంగా థియేటర్లు నడుపుతున్న ప్రదర్శనకారులేమో సినిమాహాళ్లు తిరిగి ప్రారంభిస్తే తమ నష్టాన్ని కొద్దిలో కొద్దిగా తగ్గించుకోవచ్చు కదా అనే వాదనని వినిపిస్తున్నారు.

నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలూ చాలానే ఉన్నాయి. అవి థియేటర్ల పునః ప్రారంభం గురించే ఎదురు చూశాయి. కానీ ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడం, మరోపక్క వడ్డీల భారం పెరుగుతుండడం, అదే సమయంలో ఓటీటీ వేదికల నుంచి ఆఫర్లు వస్తుండడం వల్ల చాలా సినిమాలు అటువైపు వెళ్తున్నాయి.

"ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ అన్ని వ్యాపార రంగాల్ని ప్రారంభించుకోవడానికి అనుమతిచ్చినట్లే.. థియేటర్లు తెరచుకోవడానికీ ప్రభుత్వం అనుమతులివ్వాలి. థియేటర్ల గుత్తాధిపత్యం చేస్తున్న కొద్ది మంది వ్యక్తులు ఇప్పుడప్పుడే సినిమా హళ్లు తెరవనివ్వొద్దని ప్రభుత్వాల్ని కోరుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి లేఖలు కూడా పంపారు. 25శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరవడం వల్ల యజమానులకు గిట్టుబాటు కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కంటెంట్‌ లేదని చేతగాని మాటలు చెబుతున్నారు. ఇది చాలా తప్పు ప్రభుత్వ పనిని అడ్డుకునే ప్రయత్నమిది. 25 - 30శాతం ఆక్యుపెన్సీ కచ్చితంగా వర్కవుటౌతుంది. మా వల్ల కాదనుకున్న వాళ్లు థియేటర్లు బంద్‌ పెట్టుకుంటారు. ప్రస్తుతం థియేటర్ల మూసివేత వల్ల నష్టపోతున్న వాళ్లు దాదాపు 20లక్షల మందికి పైగానే ఉండొచ్చు. మా 'సుదర్శన్‌ 35', 'దేవీ 75' థియేటర్లలోనే దాదాపు వంద మంది వరకు పని చేస్తున్నారు. హాళ్లు మూతపడ్డాక.. ఆదాయం లేకున్నా రెండు నెలల వరకు మా సిబ్బందికి పూర్తి జీతాలిచ్చాం. కానీ, ఇప్పుడు నిర్వహణ భారం భరించలేక వాళ్ల జీతాల్లో కోత పెట్టాల్సి వచ్చింది. చాలా మంది యజమానులు నష్టాలు భరించలేక సిబ్బందిని తొలగించేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే మాతో పాటు మరిన్ని జీవితాలు రోడ్డున పడాల్సి వస్తుంది. కాబట్టి థియేటర్లు తెరవడంపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. థియేటర్‌ యజమానులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో తీసేసిన పార్కింగ్‌ ఛార్జీలను తిరిగి పునరుద్దరించాలి".

- బాల గోవింద రాజు, ప్రదర్శనకారుడు

"మా సింగిల్‌ థియేటర్‌ యజమానులంతా సినిమా హాళ్లు తెరవడానికి సిద్ధంగానే ఉన్నాం. లీజుకు తీసుకున్న కొందరు యజమానులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే హాళ్లు తెరిచాక సరిగా నడిచినా.. నడవకున్నా వాళ్లు రూ.లక్షల్లో అద్దెలు చెల్లించాల్సిందే. మాలాంటి సొంత యజమానులకు ఎంతోకొంత నడిచినా కాస్త నష్ట భారాన్ని తగ్గించుకోగలుగుతాం. కానీ, థియేటర్ల గుత్తాధిపత్యం చేస్తున్న కొందరు మాత్రమే సినిమా హాళ్లు తెరవనీయకుండా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. నిజంగా వాళ్లకిందులో ఏమైనా ఇబ్బంది ఉంటే.. వాళ్లు థియేటర్లు బంద్‌ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ, వాళ్ల స్వీయ ప్రయోజనాల కోసం అందరినీ బలి చెయ్యాలని చూస్తే ఎలా? దురదృష్టమేంటంటే ప్రభుత్వం కూడా ఈ కొద్దిమంది సినీపెద్దలతోనే చర్చలు జరుపుతోంది. మాలాంటి వారి గోడు వినట్లేదు. ఫలితంగా మా సింగిల్‌ థియేటర్‌ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నాం. మేం ప్రస్తుతం థియేటర్‌ నడిచినా.. నడవకున్నా విద్యుత్‌ ఛార్జీలు, సిబ్బంది ఖర్చులు అన్నీ కలుపుకుని రూ.లక్షకు పైగా ఖర్చు భరించాల్సి వస్తుంది. విద్యుత్‌ సంస్థలు చిన్న థియేటర్‌కు రూ.30,000, పెద్ద థియేటర్‌కు రూ.100,000 అని ఫిక్స్‌డ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విధానాన్ని రద్దు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదు. మేము ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లలో అన్ని రకాల రక్షణా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మా పరంగా మేమెలాంటి భద్రతా చర్చలు తీసుకుంటామో కేంద్ర ప్రభుత్వానికీ నివేదిక పంపించాం. కానీ, ఇంత వరకు దానిపై స్పందన లేదు."

- విజేందర్‌ రెడ్డి, ప్రదర్శనకారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.