ETV Bharat / sitara

ఆ విషయం మాత్రం బాధగా ఉండేది: ఎస్పీ బాలు - sp balu death

తన జీవితంలో కొన్ని విషయాల పట్ల చాలా బాధగా ఉండేదని గతంలో జరిగిన ఇంటర్య్యూలో సింగర్ బాలు చెప్పారు. తన సంగీత ప్రయాణం మాత్రం అద్భుతమని వివరణ ఇచ్చారు.

ఆ విషయం మాత్రం బాధగా ఉండేది: ఎస్పీ బాలు
SPB death
author img

By

Published : Sep 25, 2020, 8:23 PM IST

"నా పిల్లల ఎదుగుదలను చూడలేకపోయానని బాధగా ఉంది" అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటే తన జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనల్ని పంచుకున్నారు.

"నా పిల్లలు పెరిగే వయసులో, వారితో ఉండలేకపోయాను. 49 ఏళ్ల కెరీర్​లో(2015లో మాట్లాడతూ) రోజుకు సరాసరి 11 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో చరణ్, పల్లవిల ఎదుగుదల చూడలేకపోయాను. సంప్రదాయ సంగీతం నేర్చుకోలేకపోయాను. ఇంజినీరింగ్ డిగ్రీ సగంలోనే వదిలేశాననే బాధగా ఉండేది" -ఎస్పీ బాలు, ప్రముఖ గాయకుడు

1966లో 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' సినిమాతో గాయకుడిగా కెరీర్​ ప్రారంభించారు బాలు. తనకు ప్రతిరోజూ మలుపులేనని, అంకిత భావంతో ఉండటం వల్లే ఇన్నేళ్ల పాటు కొనసాగగలిగానని అన్నారు.

SPB's regrets in his life
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

"పాటల కోసం 5 గంటలకు స్టూడియోకు కొన్నిసార్లు వెళ్లేవాడిని. ఆ తర్వాత నాకు నేను సిద్ధం చేసుకునేవాడిని. పూర్తిస్థాయిలో సరే అనుకున్న తర్వాతే మైక్రోఫోన్​ ముందుకు ఉండేవాడిని. చిన్న పెద్దా దర్శకుడు అనే తారతమ్యం నాకు ఉండేది కాదు. పాటకు న్యాయం చేయాలనేది నా ఆలోచన" -ఎస్పీ బాలు, గాయకుడు

చెన్నైలో శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచిన బాలు.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో పాటలు పాడి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. మహమ్మద్ రఫీ.. తన 'ఆల్​టైమ్ ఫేవరెట్' అని గతంలో చెప్పారు. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.