ETV Bharat / sitara

లాలి సుబ్రహ్మణ్యం.. జోలాలి సుబ్రహ్మణ్యం - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(sp balasubramaniam songs). ఆయనే మనమంతా ఆప్యాయంగా పిలుచుకునే ఎస్పీ బాలు(SPB Songs). అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. నెల్లూరులో పుట్టి.. సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సంగీత సామ్రాట్‌ మననుంచి దూరమైనా పాట రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు. ఆయన మనకు దూరమై నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.

sp subramaniam
బాలసుబ్రహ్మణ్యం
author img

By

Published : Sep 25, 2021, 3:38 PM IST

స్వరాల పుష్కరిణిలో గళ తెప్పోత్సవం.

సప్తస్వరాలకు చక్రస్నానం

పరిమళార్చనం.. స్వరవిన్యాస వినూతనం

సుమధురమే నీ సుధా గానం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

నీ ఆలాపన.

నీ లాలాపన

పండిత సంగీత ఆరాధ్యోత్సవాలకు దీప జ్వలన

అలసిన మనసులకు సరిగమల ఉద్దీపన

నవ రాగ శృతులలో, లయలలో

స్వరగతులలో..సంగతులలో..

నీవో అర్ధశతాబ్దపు పాట

రాగంపై నీది అనురాగపు సయ్యాట

విశ్రమించింది దేహమే కదా?

సందేహమా?

మరణంలోనూ ఉందిగా 'రణం'.

తుదిశ్వాసదాకా రణము.

సప్తస్వరాలపై నీ మోహానికా మరణం?

సంగీత జగమంతా బాలుమయం

పాట కచేరీలు, హృద్య భాష్య కచేరీలకు నీవు వస్తావని

చావును చావగొట్టి మృత్యుంజయుడివై వస్తావని భావించాం

అయినా దశాబ్దాలపాటు ఇక ప్రతి చోటా నీ పాటే

నీ మాటే.. నీవు చూపిన 'సరిగమకాల' బాటే

అంపశయ్య మీద నీ చివరాఖరి పోరాటం వీరోచితమే.

దేహాన్ని నిద్రపుచ్చి వస్తానని వెళ్లినవాడివి మళ్లీ రాలేదే.

ఏడేడు లోకాల్లో స్వరాల పల్లకీలో ఎక్కడ విహరిస్తున్నావో

దేవ గాంధార లోకాల్లో ఊరేగుతున్నావా

నీ పల్లకీ భుజాన మోసింది దివ్య మూర్తులేనా?

సామ వేద పండితుల 'గుండియల్ దిగ్గురనగ'

దివిజ లోకాలకు తరలిపోయావా స్వరరాజా

జగదానంద కారకుడు నీ చెవిలో ఏం చెప్పాడో ఏమో!

భలేవాడివి శ్రీరామా అంటూ వెళ్లావు.

జోల పాడి పసివాళ్లని నిద్రపుచ్చినట్లు నీ మధురస్వరాలతో

భూగోళాన్ని తన్మయ డోలికల్లో ఓలలాడించి

లాలిజో లాలిజో ఊరుకో అంటూ ఊయలలూపి

తరాల నీ స్వరాలపనను కానుకగా ఒసగి వెళ్లిపోయావా?

తిరిగి వచ్చిందాకా.. అందాకా వినండని

వేలవేల గీతాలిచ్చి.. లాలించి, ఊరడించి నిష్క్రమించావా?

వచ్చేదీ, వేళ్లేదీ చెప్పరేమో

మహాత్ములు. మార్మికులు.

'నానాటి బతుకు నాటకము'

ఇక 'ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేనా నీ ఏలిక?'

గగనానికి ఏగిన స్వరరాజా

వినీల విహాయసంలో నవస్వరాన్వేష విహారీ

'వచ్చుటా నిజమే.. పోవుటా నిజమే..

ముఖారి రాగాన్ని మా ముఖాన వేసి పోయావా?

అంతటా నీవే ఆత్మలా పొదిగావు కదా?

గీత, సంగీత చరిత్ర ఊసులు పంచి

ఇంటిమనిషిలా ఎదఎదనూ ఆక్రమించావు

సంగీత దిశ కంఠుడు.. దశదిశలా నీ యశస్సులు

ప్రతివాళ్లూ నిన్ను మా వాడే అనుకున్నారు

సుబ్రహ్మణ్య స్వామీ.. నీకంటే

నిన్ను తలచే వారికంటే

అతడిని తలిచే వారే అధికము

ఆతడిని కొలిచేవారే అధికమాట

ఏదో పాటలో అన్నట్లు.. చిత్రమే అది చిత్రమే..

బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామీ ఇది నిజమే.. నిజమే..

తెలుగు బాలూ, వెలుగు బాలూ..

సంగీత, సాహిత్య పాండిత్య ఆరాధ్యుడవు

ఇంటింటికీ సంగీతం మాస్టారిలా

చిన్నారి కిన్నెరల కంఠాలను సవరించి

నవయువ, నవయుగ గాయకులుగా తీర్చిదిద్ది

మళ్లీ వాళ్ల పాటలకే పట్టాభిషేకాలు చేశావు.

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ..

సుందర రామమూర్తి నీకోసమే రాశారేమో

కోయిల చెట్టును విడిచి పోయినా

వనమంతా ఖాళీచేసి వెళ్లినట్లే

పాటల మనిషి ఖ్యాతిని సొంతం చేసుకునే పోటీనా అది?

నీవు తెలుగువాడివనే అనుకున్నాము.

ఖండఖండాల్లో, దేశ దేశాలలో

నీవు నిరంతరము వెలుగువాడివని తెలుసుకున్నాము

నీవు మా వాడివే నంటూ

సగర్వంగా చాటుకున్నారు గాన సుబ్రహ్మణ్య భారతీయుడా!

నీకిష్టమైన మిత్రుడు రఫీ ఎప్పుడో అన్నారుగా..

కొంచెం మార్చుకున్నాములే

ఎంతవారుగానీ, వేదాంతులైన గానీ

నీ మధుర స్వరాల కైపులో తేలిన వారే..

చక్ర స్నానము చేయించింది నీవే

చక్రవాకంలో ముంచెత్తిందీ నీవే

స్వర నిధీ, సంగీత కళానిధీ

అందరినీ నీ తీయని స్వరాల చెరలో బందీలుగా చేసి

మధుర తుషారాలతో మనసు తాకి

హృదయకవాటాలలో జలతరంగిణులాడావు

గంధర్వ గాయకుడా

ఓంకారమైనా, గండు తుమ్మెదల ఝంకారమైనా

స్వరాలు పలికించి, తీయ తేనీయలు ఒలికించావు

మరి మరి..నీకు

'అద్వైతం సిద్ధించిందా?

అమరత్వం లబ్దించిందా?'

రాగరాజ నిలయాల్లో నీ ఆరోధనోత్సవాల్లో

జనులంతా తరతరాలకు నిన్ను స్థుతించాలి

వేనవేల గళాల్లో బాలుడివై.. గాన లోలుడివై పల్లవించాలి

లాలి సుబ్రహ్మణ్యం జోలాలి సుబ్రహ్మణ్యం.

బాల బాల.. ఆ బాల గోపాల సుబ్రహ్మణ్యం. నీ జన్మ ధన్యం

-పారుపల్లి శ్రీధర్

ఇవీ చూడండి

ఆ 'సినిమా' పాట.. ఎస్పీ బాలు.. జాతీయ అవార్డు

గాన గంధర్వుడికి ఘనమైన అక్షర నివాళి..

బాలు మళ్లీ రావాలి.. గానామృతాన్ని పంచాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.