ETV Bharat / sitara

రికార్డ్​: 5 దశాబ్దాలు.. 16 భాషలు.. 40 వేల పాటలు - sp balu covid news

ఎంతటి కష్టమైన బాణీ అయినా.. ఆ గాత్రం ముందు చిన్నబోవాల్సిందే. ఎంతటి కఠినమైన రాగాలైనా సరే.. అలవోకగా ఆ స్వరం నుంచి జాలువారాల్సిందే. గంధర్వులు ఇలకు వచ్చి పాడుతున్నారా అని విస్తుపోయేలా ఉంటుందా.. గాన మాధుర్యం. ఆయన పాట ఒక్కసారి వింటే చాలు..! ఎంతటి ఒత్తిడైనా చిటికెలో మాయం కావాల్సిందే. ఆ మంత్రం.. ఆ గాత్రం సొంతం. తొలి అవకాశం వచ్చినప్పుడు ఆయన గొంతు ఎలా ఉందో...చివరి శ్వాస విడిచేంత వరకూ అలాగే ఉంది. విషాదం, ప్రేమ, ఇలా ఏ భావమైనా సరే అలవోకగా ఆ గాత్రం పలికిస్తుంది. అందుకే.. బాలు పాట అంటే అంతా ప్రాణం పెట్టి వింటారు.

balu telugu news
రికార్డ్​: 5 దశాబ్దాలు.. 16 భాషలు.. 40 వేల పాటలు
author img

By

Published : Sep 25, 2020, 1:33 PM IST

Updated : Sep 25, 2020, 2:03 PM IST

1964లో మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న బాలుకి అందులో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూడా ప్రేక్షకులలో కూర్చుని ఆ పాట విన్నారు. బాలు పాటపాడిన విధానం అతనికి నచ్చింది. ఆ కుర్రాణ్ని అభినందించారు. స్వరం బాగుందని కొన్నాళ్లు పొతే సినిమాల్లో పాటలు పాడిస్తానని అభయమిచ్చారు. ఈ సంఘటనకు ముందు గూడూరు కళారాధన సమితి నిర్వహించిన లలిత సంగీత పోటీలకు ప్రముఖ నేపథ్య గాయని జానకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ పోటీల్లో బాలుకి ద్వితీయ బహుమతి వచ్చింది.

తొలి అవకాశం...

ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకి 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం, కోదండపాణి ప్రతిపాదనకు మద్దతు పలికారు. 'ఏమి ఈ వింత మొహం' అనే పాటను కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలవాటు ప్రకారం ఒకరోజు ప్రాక్టీసుకు వెళ్లిన బాలుకు పద్మనాభం కార్యాలయంలో పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌ కనిపించారు. తడబాటులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేసి 'ఏమి ఈ వింత మొహం' పాట మొత్తాన్ని బాలుచేత పాడించి వినిపించారు. ఆపైన ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 1966, డిసెంబర్​ 15న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్‌ స్వామినాథన్‌ అధ్వర్యంలో రికార్డైంది. పాట మొదటి టేక్‌లోనే బాలు అద్భుతంగా పాడారు.

దిగ్గజాల సినిమాల్లో...

1967, జూన్‌ 2న విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న.. చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు బాలు ప్రభంజనానికి తెరలేపింది. కోదండపాణి అనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదని ఆయన పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. తరవాత చంద్రశేఖర ఫిలిమ్స్‌ వారు నిర్మించిన 'మూగజీవులు' సినిమాలో బాలు పాడిన 'దయలేని లోకాన' అనే పద్యాన్ని కోదండపాణి మహదేవన్‌కు వినిపించగా.. ఆయన డి.బి.నారాయణ నిర్మించిన 'ప్రైవేట్‌ మాస్టారు' సినిమాలో 'పాడుకో పాడుకో.. పాడుతూ చదువుకో' అనే పాటను బాలు చేత పాడించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావులకు పాడే అవకాశాన్ని ఇచ్చింది కూడా మహదేవనే. 'ఏకవీర'లో ఎన్టీఆర్‌కు, 'ఇద్దరు అమ్మాయిలు'లో అక్కినేనికి మహదేవన్‌.. బాలు చేత పాడించారు.

బాపు-రమణలు మెచ్చి...

'ప్రైవేట్‌ మాస్టారు'లో బాలు పాడిన పాట విని బాపు-రమణలు 'బంగారు పిచ్చుక' సినిమాలో బాలు చేత 'ఒహోహో.. బంగారు పిచ్చుకా', 'మనసే గని తరగని, గని తగ్గని గని' పాటలు పాడించారు. మహదేవన్‌ 'ఉండమ్మా బొట్టుపెడతా' సినిమాలో 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా', 'చుక్కలతో చెప్పాలని', 'చాలులే నిదురపో జాబిలీకూనా' పాటలు కూడా పాడించారు. ఆ తరువాత పద్మనాభం నిర్మించిన 'శ్రీరామకథ'లో కోదండపాణి 'రామకథ శ్రీరామ కథ', 'రాగమయం.. అనురాగమయం' పాటలు, మరికొన్ని పద్యాలు, శ్లోకాలు బాలు చేత పాడించారు.

అలాగే 'మంచి మిత్రులు' సినిమాలో ఘంటసాలతో కలిసి 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' పాటను బాలు పాడారు. ఈ పాటలన్నీ విశేష జనాదరణ పొందటం వల్ల బాలుకు మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది.

మహాబలుడు, ఆస్తులు-అంతస్తులు, సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన టక్కరిదొంగ-చక్కనిచుక్క, ముహూర్తబలం సినిమాలో మహదేవన్‌ సంగీత సారథ్యంలో పాటలు ఆలపించారు. ఆ పరంపరలో సారథి స్టూడియోవారి 'ఆత్మీయులు' సినిమాలో 'చిలిపి నవ్వుల నిను చూడగానే' పాటను సాలూరు రాజేశ్వరరావు బాలుచేత పాడించారు. ఇలా క్రమంగా బాలు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1969 నుంచే బాలు బాగా తీరిక లేకుండా గడిపారు. బాలు స్వరంలో వచ్చిన ఈ పాటలు ఇప్పుడు వింటుంటే ఎంత వీనుల విందుగా, హాయిగా ఉంటుందో చెప్పనలవికాదు.

ఘంటసాల తర్వాత పెద్దదిక్కు...

స్వర్ణయుగ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడే అరుదైన అదృష్టం బాలుకు దొరికింది. పెండ్యాల సారథ్యంలో తొలిసారి బాలు ఒక పద్యం పాడారు. అది నచ్చి 'మా నాన్న నిర్దోషి' సినిమాలో పెండ్యాల.. బాలుచేత మూడు పాటలు పాడించారు. సత్యం సినిమాలకు దాదాపు బాలు పాడిన పాటలే అధికం. ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కయ్యారు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..అందుకు తగ్గట్టు భావాలను తన గాత్రంలో సులువుగా, అద్భుతంగా పలికించే వారు బాలు. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" చిత్రానికి బాలు గళం అదనపు సొబగులు అద్దింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ చిత్రంలో బాలు సినీసంగీత ప్రస్థానం మేలి మలుపు తిరిగింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలరని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు.

'చెల్లెలి కాపురం' చిత్రంలో బాలు పాడిన.. 'చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన.. కర కంకణములు గల గల లాడగా' అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన రాగాలు.. శ్రోతల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఏ పాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలుకే సాధ్యం. భక్తి గీతాలనూ రసరమ్యంగా పాడటంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాల్లో ఆయన ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.

గిన్నిస్​ బుక్​లో చోటు..

నాడు ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాట తెలియని సంగీత రసజ్ఞులు ఉండరు. తన గురువు ఘంటసాల బాటలో 'భైరవ ద్వీపం'లో బాలూ పాడిన శ్రీ తుంబుర నారద నాదామృతం పాటలో..బాలూ ఆలపించిన గంధర్వ గానం శ్రోతలకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఓ పాపా లాలి చిత్రంలో 'మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు' అంటూ.. బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.

యం.యస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేశ్‌ నాయుడు, అశ్వద్థామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకుల వద్ద బాలు కొన్ని వేల మరపురాని మధుర మైన పాటలు పాడారు. ఐదు దశాబ్దాల్లో... 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు బాలు.

Last Updated : Sep 25, 2020, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.