ETV Bharat / sitara

మెగాస్టార్ ద్వయం: తోటలో ఒకరు కెమెరాతో మరొకరు - కొత్త సినిమా వార్తలు

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉంటున్న పలువురు సినీ సెలబ్రిటీలు.. తమకిష్టమైన అభిరుచులవైపు దృష్టి సారిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మమ్ముట్టి, తమన్నా, సమంత, పూజాహెగ్డే తదితరులు ఉన్నారు.

South stars who revisited old hobbies during lockdown
లాక్​డౌన్​లో పాత అభిరుచులవైపు మీ అభిమాన తారలు
author img

By

Published : Jun 26, 2020, 9:47 AM IST

Updated : Jun 26, 2020, 11:44 AM IST

కరోనా లాక్​డౌన్​ అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిత్యం షూటింగ్​లతో బిజీగా ఉండే తారలకు, ఎంతో తీరిక సమయం దొరికింది. కొందరు కుటుంబంతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు గత స్మృతులను గుర్తు తెచ్చుకొని వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. వీరిలో కొంతమంది తమ పాత అభిరుచులవైపు అడుగులేస్తున్నారు. సూపర్​స్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రఫర్​గా మారగా, మెగాస్టార్​ చిరంజీవి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. ముద్దుగుమ్మ సమంత అక్కినేని సొంతంగా తన ఇంట్లోనే క్యాబేజీ పండిస్తోంది. వీరితో పాటే ఇతర నటీనటులు ఏమేం చేస్తున్నారో చూసేద్దాం.

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రాఫర్​గా దర్శనమిచ్చారు. తాను తీసిన ఓ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. కరోనాపై అవగాహనతో పాటు, సినీ పరిశ్రమలోని విశేషాలను ఎప్పటికప్పుడూ తెలియజేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశమిస్తూ.. ఉద్యానవనంలో మొక్కలకు నీరు పోస్తున్న ఫొటోను ఇటీవలే షేర్​ చేశారు.

లాక్​డౌన్​ వేళ ముద్దుగుమ్మ సమంత.. తన ఇంటి టెర్రస్​ను గార్డెన్​గా మార్చేసింది. అందులో క్యాబేజీని పండిస్తోంది. దీని అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్న హీరో దుల్కర్​ సల్మాన్.. తన తోటలో పండే గూస్​బెర్రీలకు సంబంధించిన ఫొటోను షేర్​ చేశాడు. చెట్టెక్కి పండ్లను కోయడమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇలా తన చిన్ననాటి అభిరుచులను గుర్తు చేసుకున్నాడు.

హీరోయిన్ పూజాహెగ్డే.. తను స్వయంగా చేసిన వంటలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవలే క్యారెట్​ కేక్​ తయారు చేసిన ఈ భామ.. తన కుటుంబానికి వంట చేసి పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.

టాలీవుడ్​ హీరో విజయ్​ దేవరకొండ తన కుటుంబంతో కలిసి ఇండోర్​ గేమ్స్​ అడుతున్నాడు. ఇటీవలే పోస్ట్ చేసిన ఫొటోలో, అమ్మతో కలిసి బోర్డు గేమ్స్​ ఆడుతూ కనిపించాడు.

నటి​ మాళవిక మోహనన్​.. ఈ లాక్​డౌన్​ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు ఉపయోగించుకుంటోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

లాక్​డౌన్​లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా.. ఎక్కువగా వంటలు చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది.

ఇదీ చూడండి:మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్

Last Updated : Jun 26, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.