ETV Bharat / sitara

ఇక్కడ సూపర్​ హిట్​.. మరి అక్కడో..? - vikram vedha hindi remake

South India Movies: కథలో దమ్మున్న సినిమాని ఎవరైనా కళ్లకద్దుకోవాల్సిందే. అందుకే టాలీవుడ్, కోలీవుడ్​​ సినిమాలకు బాలీవుడ్​లో మంచి క్రేజ్​ లిభిస్తోంది. ఇక్కడ సూపర్​ హిట్​ అయిన సినిమాల్ని రీమేక్​ చేయాలని బాలీవుడ్​ దర్శకులు తహతహలాడుతున్నారు. దక్షిణాదిలో దుమ్ము దులిపి.. ఇప్పుడు ఉత్తరాదిలో తెరకెక్కుతున్నసినిమాల వివరాలను చూద్దాం ఓ సారి!

remake movies
tollywood to bollywood
author img

By

Published : Mar 4, 2022, 3:31 PM IST

South Indian Movies Remake: కథ బాగుంటే ఏ చిత్రమైనా అదిరిపోద్ది. అందుకే దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిలో ఆదరణ పెరుగుతోంది. రికార్డుల దుమ్ము దులిపిన ఇక్కడి చిత్రాల్ని రీమేక్‌గా మలుస్తున్నారు అక్కడివాళ్లు. ఈ ట్రెండ్‌ గతంలోనే ఉన్నా ఈ మధ్య జోరందుకుంది. ఇంట గెలిచి రచ్చ (బాలీవుడ్‌) గెలవబోతున్న ఆ సినిమాలు.. వాటి వివరాలు మీ కోసం!

'అన్నియన్‌'గా 'అపరిచితుడు'

2005లో కోలీవుడ్‌లో వచ్చిన 'అన్నియన్‌' ఓ సంచలనం. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ తెలుగులోనూ 'అపరిచితుడు'గా అలరించింది. కథ నచ్చిన హిందీ దర్శకులు రీమేక్‌ హక్కులు కొనుగోలు చేశారు. కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు తెరకెక్కించిన ఎస్‌.శంకరే దర్శకుడిగా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. విక్రమ్‌కి ఏ మాత్రం తీసిపోకుండా రణ్‌వీర్‌ సింగ్‌ మూడు రకాల పాత్రల్లో వైవిధ్యం చూపించేలా నటించేందుకు సిద్ధమయ్యారు. నిజానికిది 2021 చివర్లోనే రావాల్సి ఉండగా కరోనా, తమిళ నిర్మాతతో నెలకొన్న వివాదం తదితర కారణాలతో ఆలస్యమవుతోంది.

'అన్నియన్‌'గా 'అపరిచితుడు'
'అన్నియన్‌'గా 'అపరిచితుడు'

'షెహ్‌జాదా'గా మారిన 'అలవైకుంఠపురములో..'

తెలుగులో సరికొత్త రికార్డులు సృష్టించిన చిత్రం 'అల వైకుంఠపురములో..' 'పుష్ప' తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ మెప్పించిన కామెడీ, యాక్షన్‌ చిత్రమిది. బాలీవుడ్‌లో బన్నీ పాత్రను హీరో కార్తీక్‌ ఆర్యన్‌ పోషించబోతున్నాడు. తనకి జోడీగా కృతి సనన్‌ అందాలతో కవ్వించబోతోంది. దర్శకుడు రోహిత్‌ ధావన్‌. ఈ చిత్రానికి 'షెహ్‌జాదా' టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

'షెహ్‌జాదా'గా మారిన 'అలవైకుంఠపురములో..'
'షెహ్‌జాదా'గా మారిన 'అలవైకుంఠపురములో..'

సెల్ఫీ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌

కామెడీ డ్రామాతో మలయాళంలో హిట్‌ కొట్టిన సినిమా 'డ్రైవింగ్‌ లైసెన్స్‌'. పృథ్వీరాజ్ సుకుమార్‌, సూరజ్‌ వెంజర్‌ముడ్‌ నటనతో అదరగొడితే.. హిందీ ప్రేక్షకులకు ఆ రుచి చూపించడానికి అక్షయ్‌ కుమార్, ఇమ్రాన్‌ హష్మీ సిద్ధమవుతున్నారు. కథలో కొన్ని మార్పులు చేసి రాజ్‌ మెహతా తెరకెక్కించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. దీనికి 'సెల్ఫీ' అనే పేరు ఖరారు చేశారు.

సెల్ఫీ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌
సెల్ఫీ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌

అక్కడా 'హిట్‌' కొడుతుందా?

క్రైమ్‌, అపరాధ పరిశోధనాత్మక కథనంతో రూపొందిన 'హిట్‌' తెలుగులో మంచి హిట్‌ అయింది. విమర్శకుల ప్రశంసలూ దక్కించుకుంది. విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ పోషించిన పాత్రలను బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌ రావ్‌, సాన్యా మల్హోత్రా పోషిస్తున్నారు. అయితే తెలుగులో 'హిట్‌ 2' కూడా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో అడివి శేష్‌ కథానాయకుడు.

'హిట్‌'
'హిట్‌'

అజయ్‌ దేవగణ్‌ 'ఖైదీ' చేస్తాడా?

2019లో తమిళంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ' తెలుగులోనూ అలరించింది. కుమార్తెను కలవడానికి తల్లడిల్లిపోయే తండ్రిగా భావోద్వేగాలు పండిస్తూనే.. పోరాట సన్నివేశాల్లోనూ చెలరేగిపోయాడు కార్తీ. 'డిల్లీ'గా అందరి హృదయాలు దోచుకున్న ఆయనలా.. అజయ్‌ దేవ్‌గణ్‌ మెప్పిస్తాడో, లేదో చూడాలి. ఆయన హీరోగా బాలీవుడ్‌లో ఈ సినిమా రీమేక్‌ అవుతోంది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు.

అజయ్‌ దేవగణ్‌ 'ఖైదీ' చేస్తాడా?
అజయ్‌ దేవగణ్‌ 'ఖైదీ' గా

'మాస్టర్‌'గా మారుతున్న సల్లూ భాయ్‌

కరోనా సమయంలో వచ్చినా కలెక్షన్లలో దుమ్ము దులిపిన తమిళ చిత్రం 'మాస్టర్'. విజయ్, విజయ్‌ సేతుపతి పోటీపడి నటించిన ఈ యాక్షన్‌ డ్రామాని రీమేక్‌లో నటించడానికి బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఒప్పుకున్నాడు. తమిళ మాతృకను తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్‌ హిందీ సినిమానీ మలచబోతున్నాడు.

'మాస్టర్‌'గా మారుతున్న సల్లూ భాయ్‌
'మాస్టర్‌'గా మారుతున్న సల్లూ భాయ్‌

అక్కడ 'విక్రమ్‌ వేద' వీళ్లే

తమిళంలో సూపర్‌హిట్‌ అయిన యాక్షన్‌ డ్రామా సినిమా 'విక్రం వేద'. పోరాట సన్నివేశాల డోసు మరింత పెంచి అదే పేరుతో హిందీలో పునర్నిర్మిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, ఆర్‌.మాధవన్‌ పాత్రల్లో హృతిక్‌ రోషన్, సైఫ్‌ అలీఖాన్‌ను చూడబోతున్నాం. దర్శక జంట గాయత్రి, పుష్కర్‌లే ముందుండి నడిపించబోతున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్‌. ఇటీవల హిందీ విక్రమ్‌, వేద లుక్స్‌ కూడా బయటకు వచ్చాయి.

అక్కడ 'విక్రమ్‌ వేద' వీళ్లే
అక్కడ 'విక్రమ్‌ వేద' వీళ్లే

హిందీలోనూ భీమ్లా సందడి

మలయాళ హద్దులు దాటి తెలుగుకి వచ్చి 'భీమ్లా నాయక్‌'గా తెలుగులోనూ ఘన విజయం సాధించింది 'అయ్యప్పనమ్‌ కోషియమ్‌'. ఇప్పుడు హిందీ వంతు వచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులకు అలరించడానికి జాన్‌ అబ్రహం, అర్జున్‌కపూర్‌ రెడీ అవుతున్నారు. పృథ్వీరాజ్, బిజూ మీనన్‌ పాత్రలు అక్కడ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

హిందీలోనూ భీమ్లా
హిందీలోనూ భీమ్లా

ఇదీ చదవండి: వండర్​ఫుల్​గా 'బటర్​ఫ్లై' ట్రైలర్​.. ఒకే రోజు రెండు సినిమాలతో దీపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.