ETV Bharat / sitara

థియేటర్​ యజమానులకు ప్రభుత్వం అండ - చిరు హర్షం - theatres

లాక్​డౌన్​ వల్ల నష్టపోయిన థియేటర్ల యాజమానులను ఆదుకునేందుకు కొన్ని రాయితీలను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

Sops to Tollywood, Chiranjeevi Thanks CM Jagan
థియేటర్​ యజమానులకు ప్రభుత్వం అండ - చిరు హర్షం
author img

By

Published : Apr 6, 2021, 10:59 PM IST

కరోనా, లాక్​డౌన్​ వల్ల థియేటర్లు మూతపడి తెలుగు చిత్రసీమ భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజమానులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఓ జీఓ జారీ చేసింది. పలు రాయితీలు ప్రకటించింది.

ఇవీ రాయితీలు..

  • 2020 ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు సింగిల్​ స్క్రీన్​, మల్టీప్లెక్సుల్లో స్థిర విద్యుత్తు ఛార్జీల మాఫీ.
  • 2020 జులై నుండి డిసెంబరకు చెల్లించాల్సిన స్థిర విద్యుత్తు ఛార్జీల గడువు పొడిగింపు.
  • థియేటర్ల యజమానులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల పై వడ్డీ రాయితీ. ఏ, బీ సెంటర్లలో అత్యధికంగా రూ.10 లక్షల వరకు , సీ సెంటర్లలో రూ.5 లక్షల వరకు తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుంది.

చిత్రసీమను కాపాడేందుకు తీసుకున్న చర్యలపై సీఎం జగన్​ను ప్రశంసించారు మెగాస్టార్​ చిరంజీవి. ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా రాయితీలను ప్రకటించింది.

ఇదీ చూడండి: 'పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.