బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'సూర్యవంశీ' చిత్రం.. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఆదివారం ప్రకటించింది.
అయితే ఈ సినిమా గతేడాది మార్చి 24న విడుదల కావాల్సింది. కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే సినిమాహాళ్లలో 100 శాతం సీటింగ్ సామర్థ్యానికి అనుమతి రావడం వల్ల 'సూర్యవంశీ' చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.
-
THE WAIT IS FINALLY OVER! Get ready for an action-packed entertainer, kyunki - aa rahi hai police!💥#Sooryavanshi in cinemas worldwide on 30th April 2021.#Sooryavanshi30thApril pic.twitter.com/NP2O2v15Uu
— Dharma Productions (@DharmaMovies) March 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">THE WAIT IS FINALLY OVER! Get ready for an action-packed entertainer, kyunki - aa rahi hai police!💥#Sooryavanshi in cinemas worldwide on 30th April 2021.#Sooryavanshi30thApril pic.twitter.com/NP2O2v15Uu
— Dharma Productions (@DharmaMovies) March 14, 2021THE WAIT IS FINALLY OVER! Get ready for an action-packed entertainer, kyunki - aa rahi hai police!💥#Sooryavanshi in cinemas worldwide on 30th April 2021.#Sooryavanshi30thApril pic.twitter.com/NP2O2v15Uu
— Dharma Productions (@DharmaMovies) March 14, 2021
అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'సూర్యవంశీ'. యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తానిష్ బాగ్చి సంగీతం అందించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యశ్ జోహార్, అరుణ్ భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, రోహిత్‌శెట్టి నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఓటీటీ కాదు.. థియేటర్లలోనే సందడి చేస్తాం!