కొవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా మారారు నటుడు సోనూ సూద్. దేశంలో ఎవరు సాయం కోరినా కాదనకుండా తన సేవల్ని అందిస్తున్న సోనూ ప్రస్తుత పరిస్థితులు, తమ తల్లిదండ్రుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోజూ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న ఎంతోమంది కంటతడిని చూస్తున్నా. ఎన్నో హృదయాలు ముక్కలవుతున్నాయి. ఇలాంటి సంక్షోభాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు. ఒకవేళ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బతికుండి బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం పోరాడుతుంటే చూసి తట్టుకునేవాణ్ని కాదు" అని ఉద్వేగానికి లోనయ్యారు.
సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్‌లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి ఆహారం, ఇతర సామాగ్రి అందించేవారాయన. సోనూ తల్లి సరోజ్ సూద్ పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవారు. ఈ ఇద్దరూ అనారోగ్య సమస్యలతో మరణించారు.
ఇదీ చూడండి: భార్య ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూ సూద్!