ETV Bharat / sitara

బాలీవుడ్​కు 'క్రాక్​'.. హీరోగా ప్రముఖ విలన్​! - సోనూసూద్​ వార్తలు

టాలీవుడ్​ బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించిన 'క్రాక్​' సినిమాను బాలీవుడ్​లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ హక్కుల కోసం ఓ నిర్మాత చిత్రబృందాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఇందులో హీరోగా సోనూసూద్​ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

SonuSood will be hero of ravi teja's krack movie?
బాలీవుడ్​కు 'క్రాక్​'.. హీరోగా ప్రముఖ విలన్​!
author img

By

Published : Jan 17, 2021, 10:05 AM IST

మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా తెరకెక్కిన 'క్రాక్​' చిత్రం.. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్​హిట్​ టాక్​ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోన్న ఈ సినిమాను బాలీవుడ్​లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై ఓ హిందీ నిర్మాత క్రాక్​ చిత్రబృందాన్ని సంప్రదించినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇందులో హీరోగా విలక్షణ నటుడు సోనూసూద్​ నటించనున్నాడని సమాచారం. క్రాక్​ సినిమా హక్కులను పొందేందుకు సోనూ కూడా చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. సోనూ ప్రధానపాత్రలో ఇటీవలే 'కిసాన్​' అనే సినిమా ప్రకటన వచ్చింది.

సోనూసూద్​

ఇదీ చూడండి: వృద్ధ స్నేహితులుగా అమితాబ్​, బొమన్​ ఇరాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.