గతేడాది లాక్‌డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. కాగా, తాజాగా ఆయన ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఇందులో భాగంగా సోనూసూద్ చేస్తోన్న సేవలను కొనియాడుతూ డ్యాన్స్‌షోలోని కంటిస్టెంట్స్ ఓ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. వలస కార్మికులకు భోజనం అందించడం, వాళ్ల కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అలాగే ఎంతోమంది పేదవాళ్లకు ఉపాధి కల్పించడం, మందులు, ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ.. ఇలా సోనూ చేసిన ఎన్నో మంచి పనులతో సాగిన ఈ ప్రత్యేక ప్రదర్శన ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. కాగా, ప్రదర్శన ముగిసే సమయానికి సోనూ ఎమోషనలై కన్నీరు పెట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అలాగే, ఇటీవల ఆయన భారతి అనే ఓ కొవిడ్ బాధితురాలిని నాగ్‌పుర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా చేర్చి ప్రత్యేక చికిత్స అందించడంలో సాయం చేశారు. ఈ క్రమంలోనే భారతి కుటుంబసభ్యులు సోనూకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో సందేశం పంపించారు. అది చూసిన ఆయన కళ్లు చమ్మగిల్లాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.