ETV Bharat / sitara

Sonu sood: వీధి వ్యాపారితో చెప్పులు బేరమాడిన సోనూ! - వీధివ్యాపారితో సోనూ

వీధి వ్యాపారితో చెప్పులను బేరం చేస్తూ సందడి చేశారు నటుడు సోనూసూద్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

sonu sood
సోనూసూద్
author img

By

Published : Aug 7, 2021, 6:27 AM IST

నటుడు సోనూసూద్‌ మరోసారి సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో సందడి చేశారు. వీధి వ్యాపారితో చెప్పులను బేరం ఆడుతూ సోనూ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

సినిమా షూటింగ్‌ నిమిత్తం ఇటీవల జమ్మూ-కశ్మీర్‌ వెళ్లారు సోనూసూద్‌. అక్కడి మార్కెట్లో తిరుగుతూ షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్‌ ఇవ్వమని అడిగాడు.

'ఎంత డిస్కౌంట్‌ ఇస్తావు నాకు' అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్‌ '20 శాతం' అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత 'చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్‌ షాపును సందర్శించండి. నా పేరు చెప్పి డిస్కౌంట్‌ కూడా పొందండి' అంటూ ఓ వీడియోను తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల అండగా నిలిచి ప్రజాభిమానం చూరగొన్నారు సోనూ. ఇప్పుడు వీధి వ్యాపారిని సపోర్ట్‌ చేస్తూ అతడు చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూ ప్రస్తుతం చిరు కథానాయకుడిగా నటిస్తున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: సోనూసూద్ గొప్ప మనసు.. ఉచితంగా న్యాయ విద్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.