కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా బాధితులకు వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డాక్టర్లు, నర్సులు ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు నటుడు సోనూసూద్. తన హోటల్‌ను వారి కోసం అందుబాటులో ఉంచాడు.
"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది రాత్రనకా పగలనకా పని చేస్తూనే ఉన్నారు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. ఇలాంటి నిజమైన హీరోల కోసం నా హోటల్ గదులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి."
-సోనూసూద్, నటుడు
ఇప్పటికే షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్‌ను క్వారంటైన్ కేంద్రంగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ)కు అప్పగించారు.