బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్డౌన్లో వలస కూలీలకు, పేద ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్.. తమ బోయింగ్ 737 విమానంపై సోనూ ఫొటోను చిత్రించింది. "ఏ సెల్యూట్ టూ ది సేవియర్ సోనూసూద్" అనే వ్యాఖ్య జోడించింది. ఈ గౌరవాన్ని అందుకోవడంపై సోనూ హర్షం వ్యక్తం చేశారు.
లాక్డౌన్లో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఎంతో మంది వారి సొంతూళ్లకు చేరుకునేందుకు సోనూ ఎంతగానో కృషి చేశారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి వారికి అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నారు.
![sonu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11085257_as-1.jpg)
![sonu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11085257_as-4.jpg)
![sonu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11085257_as-2.jpg)
![sonu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11085257_as-3.jpg)
ఇదీ చూడండి: ఇంటి విషయంలో సుప్రీంకోర్టుకు సోనూ