సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అతని మరణానికి బాలీవుడ్లో ఉన్న పలువురు నటీనటులు కారణమని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో తీవ్ర నెగెటివిటీ ఎదురైన కారణంగా ట్విట్టర్ ఖాతాను మూసేస్తున్నట్లు సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీమ్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదే రీతిలో నటి సోనమ్ కపూర్‌కు పూర్తి వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో స్పందించింది సోనమ్.
-
I encourage you guys to see my comment section. And I’m sure you don’t hope that the same comes your way. I hope your parents don’t have to see this sort of this stuff. pic.twitter.com/dmvI3xOKVd
— Sonam K Ahuja (@sonamakapoor) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I encourage you guys to see my comment section. And I’m sure you don’t hope that the same comes your way. I hope your parents don’t have to see this sort of this stuff. pic.twitter.com/dmvI3xOKVd
— Sonam K Ahuja (@sonamakapoor) June 21, 2020I encourage you guys to see my comment section. And I’m sure you don’t hope that the same comes your way. I hope your parents don’t have to see this sort of this stuff. pic.twitter.com/dmvI3xOKVd
— Sonam K Ahuja (@sonamakapoor) June 21, 2020
"నాకు ఎదురైన కొన్ని కామెంట్స్ ఇవి. కొన్ని మీడియాలు ఈ విధమైన ప్రవర్తనను ప్రేరేపిస్తున్నాయి. ప్రజలు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపై దయ చూపమని అంటున్న ప్రజలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నా కామెంట్ సెక్షన్ చూడండి. అలాంటి వ్యాఖ్యలు ఎదుర్కోవాలని మీరు అనుకోరు. ఇలాంటి ప్రవర్తనను మీ తల్లిదండ్రులు కూడా చూడకూడదు అని అనుకుంటున్నా."
- సోనమ్ కపూర్, బాలీవుడ్ నటి
సోనమ్ కపూర్.. తన సిబ్బందితో కలిసి ఆమె కామెంట్ సెక్షన్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సోషల్‌మీడియాలో రిపోర్టు చేసింది. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి అనిల్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ..స్టార్ నటుడి కుమార్తెగా తనకున్న హక్కును ప్రస్తావిస్తూ, ఆమెకు అది గర్వకారణమని ట్విట్టర్లో తెలిపింది.