ETV Bharat / sitara

వివాదాల్లో మమ్మల్ని విలన్లు చేసేస్తున్నారు: సోనమ్

పురుషాధిక్యం వల్ల బాలీవుడ్​లో మహిళా కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోనమ్​ కపూర్​ ఆందోళన వ్యక్తం చేసింది. స్త్రీలపై దుర్భాషణలను చూస్తోంటే తనకు భయం వేస్తోందని చెప్పింది.

Sonam Kapoor on Bollywood being attacked: Male actors, directors are made into heroes
'బాలీవుడ్​ వివాదాల్లో స్త్రీలను విలన్లుగా మార్చేస్తున్నారు'
author img

By

Published : Nov 14, 2020, 12:04 PM IST

Updated : Nov 14, 2020, 2:23 PM IST

బాలీవుడ్​లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై హీరోయిన్ సోనమ్​ కపూర్​.. మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై జరుగుతున్న దుర్భాషణలు చూస్తోంటే భయం వేస్తోందని తెలిపింది. మహిళా కళాకారులను గౌరవించకుండా, వారి నైతిక ప్రవర్తనను సందేహిస్తున్నారని అన్నారు. సుశాంత్​ సింగ్​​ మృతి తర్వాత నెలకొన్న పరిస్థితులపై ఈమె పై వ్యాఖ్యలు చేసింది.

"నేను ఆ వివాదాల్లో లేను. కానీ, నా సహనటులు అందులో ఉండడం బాధ కలిగిస్తోంది. హీరోయిన్లే లక్ష్యంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పురుషుడిపైనా ఇలాంటి ఆరోపణలు రావటం లేదు. సినిమాల్లో, ఫ్యాషన్​ ఇండస్ట్రీలో స్త్రీలను క్రియేటివ్​ వ్యక్తులుగా గుర్తించడంలేదు. బదులుగా వారి నైతికతను సందేహిస్తున్నారు. మేమూ కళాకారులమే. మాకు మగ నటులకు, దర్శకులకు మధ్య ఉండే తేడా ఏంటి? వాళ్లు ఏమో హీరోలుగా కొనసాగుతున్నారు. మేము బాధితులుగా మిగిలిపోతున్నాం"

--సోనమ్​ కపూర్​, హీరోయిన్​

ఇండస్ట్రీలో పురుషులకు, మహిళలకు మధ్య చాలా తేడా ఉంటుందని సోనమ్ చెప్పింది​. సుశాంత్​ మృతి తర్వాత తన దగ్గరవారిని లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సాగడంపై ట్వీట్​లు చేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో సోనమ్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తనను బెదిరిస్తూ వచ్చిన సందేశాల స్క్రీన్​షాట్లను ఇన్​స్టా వేదికగా గతంలో పంచుకుంది.

ఇదీ చదవండి:మరో హిందీ నటుడు ఆత్మహత్య

Last Updated : Nov 14, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.