ETV Bharat / sitara

బాలీవుడ్ స్టార్ హీరోయిన్​పై చీటింగ్ కేసు..! - సోనాక్షి సిన్హా లేటెస్ట్​ న్యూస్

Sonakshi sinha news: బాలీవుడ్​ నటి సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడ్డారు. చీటింగ్​ కేసులో భాగంగా ఆమెపై నాన్​ బెయిలబుల్ వారెంట్​ను జారీ చేసింది కోర్టు. ఇంతకీ ఏమైందంటే?

sonakshi sinha
సోనాక్షి సిన్హా
author img

By

Published : Mar 6, 2022, 5:12 PM IST

Sonakshi sinha news: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై నాన్​బెయిల్​ వారెంట్​ను జారీ చేసింది ఉత్తర్​ప్రదేశ్​లోని మోరదాబాద్​ కోర్టు. ఆమె వచ్చే నెలలో హాజరు కావాలని ఆదేశించింది.

ఏమైందంటే?

2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈవెంట్ మేనేజర్​ ప్రమోద్ శర్మ ముందుగానే ఆమెకు రూ.28లక్షలు అందజేశారు. అయితే అనుకున్న సమయానికి ఆ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టారు సోనాక్షి సిన్హా. దీంతో ప్రమోద్​.. తాను చెల్లించిన మొత్తాన్ని ఇచ్చేయాలని డిమాండ్​ చేశారు. దీనికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశారు ప్రమోద్ శర్మ. ఈ క్రమంలో ఆమెకు నాన్​బెయిల్ వారెంట్ జారీ చేసింది మొరదాబాద్​ కోర్టు. వచ్చేనెల కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్​' ఫస్ట్​ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.