ETV Bharat / sitara

కార్మికుల కోసం కళాకృతులను వేలానికి పెట్టిన సోనాక్షి - Fankind movement

కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని కార్మికులెందరో వీధినపడ్డారు. వారికి రోజూవారి రేషన్ అందించడానికి తన కళాకృతులను వేలానికి పెట్టింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.

సోనాక్షి
సోనాక్షి
author img

By

Published : May 15, 2020, 7:40 PM IST

కరోనా వైరస్‌ కారణంగా దేశంలోని అసంఘటితరంగ కార్మికులెందరో వీధినపడ్డారు. వారికి రోజూవారి రేషన్‌ అందించడానికి నిధుల సేకరణలో భాగంగా బాలీవుడ్‌ నటి తన కళాకృతులను వేలానికి పెట్టింది. అన్షులా కపూర్‌ నిధుల సేకరణ వేదికగా 'ఫ్యాన్‌కైండ్‌' అనే దాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తన దగ్గర ఉన్న కళాకృతులను, పెయింటింగ్స్‌ను వేలానికి పెట్టింది. అంతేకాదు పెయింటింగ్స్‌తో కూడిన వీడియోను ట్విట్టర్లో పంచుకుంది.

"కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజూవారి కూలీల కోసం ఏర్పాటు చేసిన 'ఫ్యాన్‌కైండ్‌'లో భాగస్వామినయ్యాను. మీరంతా అత్యధికంగా బిడ్డింగ్‌ వేసి ఆదుకోండి.." అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే పీపీఈ కిట్లను పుణెలోని సర్దార్‌ పటేల్‌ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకుంది. ప్రస్తుతం ఈ 'ఫ్యాన్‌కైండ్‌'లో చాలామంది సెలబ్రిటీలు చేరారు. ఈ నిధుల సేకరణ, స్వచ్చంధ సంస్థలకు ఉపయోగపడుతుంది.

సోనాక్షి ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌తో కలిసి 'భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'లో సామాజిక కార్యకర్త పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.