ETV Bharat / sitara

చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో దబాంగ్ బ్యూటీ? - చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో సోనాక్షి సిన్హా

చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో ఓ బాలీవుడ్​ హీరోయిన్​ నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఆ హీరోయిన్​ ఎవరు?

chiru
చిరు, బాలయ్య
author img

By

Published : Mar 22, 2021, 5:35 AM IST

Updated : Mar 22, 2021, 6:26 AM IST

ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ కొత్త చిత్రాల్లో బాలీవుడ్‌ భామ నటిస్తోందా? అవకాశాలున్నాయని అంటున్నాయి సినీ వర్గాలు. ఆయా చిత్ర బృందాలు ఇప్పటికే ఆమెను సంప్రదించాయని సమాచారం. ఇంతకీ ఆమె ఎవరంటే? 'దబాంగ్‌' బ్యూటీ సోనాక్షి సిన్హా. యువ దర్శకుడు బాబీతో చిరంజీవి ఓ చిత్రం ప్రకటించారు. ఇందులో నాయికగా సోనాక్షి అయితే బావుంటుందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించినట్టు తెలుగు, హిందీ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరోవైపు బాలకృష్ణ- గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ ఈ భామనే నాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఈ మేరకు సోనాక్షితో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ఆమె సుముఖంగానే ఉందని టాక్‌. త్వరలోనే స్పష్టత రావచ్చు.

ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ భామలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కలయికలో తెరకెక్కనున్న చిత్రంతో అగ్ర కథానాయిక దీపికా పదుకొణె, పూరి జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'లైగర్‌' సినిమాతో యువ నాయిక అనన్య పాండే త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఈ జాబితాలో సోనాక్షి నిలుస్తుందా, లేదా అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

sonakshi
సోనాక్షి

ఇదీ చూడండి: ఈ జీవితం బోర్ కొట్టేసింది: సోనాక్షి సిన్హా

Last Updated : Mar 22, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.