ETV Bharat / sitara

550సార్లు విడుదలైన సినిమా ఏంటో మీకు తెలుసా? - కన్నడ సినిమా వార్తలు

ఓ సినిమా 100 రోజులు ఆడితే బ్లాక్​బస్టర్​ అంటాం. అలాంటిది.. ఏకంగా 75 సార్లు 100 రోజులు ఆడితే? మొత్త మీద 550 సార్లు రీరిలీజ్​ అయితే? ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కన్నడ ప్రజల్లో క్రేజ్​ మామూలుగా లేదు మరి!

om movie records, ఓం ఉపేంద్ర
550 సార్లు విడుదలైన సినిమా ఏంటో మీకు తెలుసా?
author img

By

Published : Aug 21, 2021, 8:06 PM IST

సినిమా బాగుంది అన్న టాక్​ వస్తే చాలు.. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిపోతుంది. ఓ సినిమా 100 రోజులు ఆడింది అంటే అది ప్రేక్షకుల దృష్టిలో పెద్ద హిట్! మరి అదే సినిమా థియేటర్లలో 100 రోజులకు మించి ఆడితే ఇంక ఆ సినిమాకు ఫిల్మ్​ ఇండస్ట్రీ చరిత్రలో, ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలను రీరిలీజ్​ చేస్తుంటారు. సాధారణంగా రీరిలీజ్​ కూడా ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. కానీ ఓ సినిమాకు 550పైగా రీరిలీజ్​లు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ నిజం. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వంలో శాండిల్​వుడ్​ స్టార్​ నటుడు శివరాజ్​కుమార్​ హీరోగా తెరకెక్కిన 'ఓం' చిత్రం సృష్టించిన రికార్డులే ఇవన్నీ. 1995లో విడుదలైన ఈ చిత్రానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

ఒక లెటర్​తో స్టోరీ..

ఎవరో రాసిన ఓ లేఖ నుంచి ఈ సినిమా కథ పుట్టింది అంటే నమ్మగలరా? కానీ 'ఓం' సినిమా విషయంలో అదే జరిగింది. 80వ దశకం చివరిలో ఈ కథ రూపుదిద్దుకుంది. కాలేజీ రోజుల్లో ఉపేంద్ర స్నేహితుడు పురుషోత్తం.. అతని దృష్టిని ఆకర్షించిన ఓ లేఖను ఉపేంద్రకు చూపించాడు. ఆ లేఖ నుంచి పొందిన స్ఫూర్తితో.. దర్శకుడు తన కథలోని మొదటి భాగాన్ని సిద్ధం చేశారు.

నిజ జీవిత కథ..

ఈ సినిమా నేపథ్యాన్ని ఉపేంద్ర సోదరుడి స్నేహితుడైన సత్య అనే వ్యక్తి జీవితం ఆధారంగా తీర్చిదిద్దారు. ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఈ కథ నేపథ్యం.

సినిమా కోసం బెయిల్​

ఈ చిత్రంలో నిజ జీవితంలో అండర్​వరల్డ్​తో సంబంధాలు ఉన్న వ్యక్తులు నటించారు. ఇందుకోసం కొందరు నేరస్థులకు బెయిల్​ ఇప్పించాల్సి వచ్చింది. జేదరహల్లి కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్​వీర్​ వంటి పేరు మోసిన రౌడీలు ఇందులో నటించారు.

om movie records, ఓం ఉపేంద్ర
'ఓం' సినిమా పోస్టర్

దేశమంతటా చర్చే..!

ఈ సినిమా విడుదలకాక ముందు నుంచే దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇటువంటి సినిమాను దిగ్గజ నటుడు రాజ్​కుమార్​ బ్యానర్​లో నిర్మించి ఉండాల్సింది కాదంటూ ఓ మ్యాగజైన్ ఏకంగా కవర్​ స్టోరీనే ప్రచురించింది.

భారీ బడ్జెట్..

డాక్టర్​. రాజ్​కుమార్​ బ్యానర్​లో నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్​ రూ.70 లక్షలు. అప్పటికి ఇంత మొత్తంలో సినిమా తీయడం రాజ్​కుమార్​ బ్యానర్​కు అదే తొలిసారి. విడుదలకు ముందే ఈ చిత్రం ప్రీ రిలీజ్​ బిజినెస్​లో భాగంగా రూ.2 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత.. 'ఓం' చిత్రం ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది.

ప్రతి ఏడాది రీరిలీజే..

1995లో విడుదలైన ఈ చిత్రానికి కన్నడ సీమలో విపరీతమైన క్రేజ్​ వచ్చింది. ఎంతలా అంటే.. అభిమానుల కోసం ప్రతి ఏడాది థియేటర్లలో రీరిలీజ్​ చేస్తూ వచ్చింది చిత్ర బృందం. రిరిలీజ్​లలో భాగంగా 75 సార్లు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

1995-2017 వరకు 550పైగా రీరిలీజ్​లు ఉన్న ఈ చిత్రం లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది.

20 ఏళ్ల తర్వాత కూడా..

శాండిల్​వుడ్​లో అప్పటివరకు ఉన్న ఓపెనింగ్​ రికార్డులను 'ఓం' బద్దలుకొట్టింది. రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి కన్నడ సినిమాలో అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

20 ఏళ్ల తర్వాత కూడా.. 2015లో ఈ చిత్రం టీవీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. రూ. 10 కోట్ల రూపాయలకు టీవీ హక్కులను సంబంధిత సంస్థ దక్కించుకుంది.

ఇన్ని రికార్డులు ఉన్న ఈ 'ఓం' చిత్రం కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో ఓ క్లాసిక్​గా నిలిచిపోయింది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.